జగన్ పర్యటనను జయప్రదం చేయండి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
వరంగల్ : ఈ నెల 12వ తేదీన జిల్లాలో వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను జయప్రదం చేయూలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని హన్మకొండలో ఆయ న పరామర్శిస్తారని మహేందర్‌రెడ్డి తె లిపారు. హన్మకొండలోని పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణరాజ్ ఇంటి వద్ద శనివారం మహేందర్‌రెడ్డి మాట్లాడారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియాకమైన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలి పారు. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 12వ తేదీన జగన్ జిల్లాకు వస్తున్నందున పార్టీ నాయకులు, కార్యకర్త లు, వైఎస్ అభిమానాలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించి నందుకు జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపే తం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తల సహకారంతో రానున్న రోజుల్లో నిర్మాణాత్మకంగా పటిష్టం చేస్తామన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్‌రాజ్, పార్టీ నాయకులు మహిపాల్‌రెడ్డి, అప్పని కిషన్, జీడికంటి శివ, దయాకర్, రఘు, కాగిత రాజ్‌కుమార్, రజనీకాంత్, శ్రావణ్, జలంధర్, రాము లు, బద్రూద్దీన్,ఖాన్, సంతో ష్, మాధవ్, గాంధీ, సిద్ధార్థ, ప్రశాంత్, రాజు పాల్గొన్నారు.