అవసరమైతే ప్రత్యక్షంగా ఉద్యమిస్తాం..
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని రప్పిస్తాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం
పార్టీ నేతలు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మునిగాల విలియం
బిల్ట్ కార్మికులకు అండగా ఉంటామని.. అవసరమైతే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని రప్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం అన్నారు. మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్
కర్మాగారం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం తెలిపి మాట్లాడారు..
- కమలాపురం(మంగపేట)
కమలాపురం (మంగపేట) : బిల్ట్ కార్మాగారాన్ని కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూ ర్ణ మద్దతు ఇస్తోందని, కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం అన్నారు. కమలాపురంలోని బిల్ట్ కార్మాగారం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నా రు. ఈ సందర్భంగా జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మునిగాల విలియం మాట్లాడుతూ కొత్తపరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం బిల్ట్ కర్మాగారం సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కర్మాగారంలో ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 10 వేల మంది కార్మికులు ఉపాధి కరువై రోడ్డున పడినా ప్రభుత్వాలు చొరవచూపకపోవడం చాలా దారుణమన్నారు. కార్మాగారం మూతపడడంతో 10 నెలల నుంచి ఉపాధి కరువై సుమారు 8 వేల మంది కార్మికుల కుటుంబాలు విలవిల్లాడుతున్నాయని, అరుునా సమస్యను పరిష్కరించడంలో ఎంపీ లు, మంత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తుండడం శోచనీయమన్నారు. ఇప్పటికే సుమారు 5వేల మంది బిల్ట్ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ట్ విషయాన్ని అసెంబ్లీ, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
అవసరమైతే జగన్‌మోహన్‌రెడ్డిని కమలాపురానికి తీసుకువచ్చి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడిగంటి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత రాజ్‌కుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు ముని గాల కల్యాణ్‌రాజ్, సేవాదల్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, ప్రోగ్రాం ఆర్గనైజర్ అ ప్పం కిషన్, అధికార ప్రతినిధి పుల్యాల గాం ధీ, మొగిళ్లపల్లి మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు రజనీకాంత్, సతీష్, పప్పు రాజిరెడ్డి, ఎండీ. కైసర్, ఆనంద్, ఎస్‌కే.గౌస్, ఎస్‌డీ సయ్యద్, మాదిరి నరేష్ బిట్టు, జేఏసీ నాయకులు చాతరాజు చొక్కారావు, వడ్డెబోయిన శ్రీనివాస్, కుర్బాన్‌అలీ, జోగినపల్లి వెంకట్రావు, డీవీపీ రాజు, పాకనాటి వెంకట్రావు, కొడాలి మల్లీశ్వర్రావు పాల్గొన్నారు.
బిల్ట్ కార్మికులకు అండగా ఉంటాం
Published Fri, Feb 27 2015 12:24 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement