Built-workers
-
సీఎం తమ గోడు వినాలని బిల్ట్ కార్మికుల ఆందోళన
మంగపేట(కమలాపురం) : మండలం మీదుగా భారీ పోలీస్ బందోబస్త్ నడుమ తన కాన్వాయ్‌తో వరంగల్‌కు తరలివెళ్ళి ముఖ్యమంత్రి పర్యటన కమలాపురం బిల్ట్ కార్మికులను నిరాశ పరిచినట్లయింది. మండలానికి పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురంలో భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం మండలం మీదుగా వరంగల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా 47 రోజులుగా బిల్ట్ కర్మాగారం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు, కార్మిక కుటుంబాల మహిళలు వందలాది మంది ముఖ్యమంత్రిని కలిసి బిల్ట్ సమస్యతో పాటు బిల్ట్ ఫ్యాక్టరీని మూసివేయడం వలన ఎదురయ్యే సమస్యను నేరుగా విన్న వించుకునేందుకు తరలివచ్చి బిల్టు మెయిన్ గేటు వద్ద మండు టెండను లెక్కచేయకుండా రెండున్నర గంటల పాటు వేచి చూశారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు రోడ్డుకు అడ్డంగా వచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఏటూరునాగారం సీఐ కిశోర్‌కుమార్, ఎస్సై వినయ్‌కుమార్, మంగపేట ఎస్సై ముష్కం శ్రీనివాస్ సీఆర్పీఎఫ్ బలగాలతో ఫ్యాక్టరీ గేటు ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఏటూరునాగారం బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపైకి ఎవరినీ రానీయకుండా అడ్డుకున్నారు. -
బిల్ట్ కార్మికులకు అండగా ఉంటాం
అవసరమైతే ప్రత్యక్షంగా ఉద్యమిస్తాం.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని రప్పిస్తాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం పార్టీ నేతలు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మునిగాల విలియం బిల్ట్ కార్మికులకు అండగా ఉంటామని.. అవసరమైతే వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని రప్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం అన్నారు. మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ కర్మాగారం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం తెలిపి మాట్లాడారు.. - కమలాపురం(మంగపేట) కమలాపురం (మంగపేట) : బిల్ట్ కార్మాగారాన్ని కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూ ర్ణ మద్దతు ఇస్తోందని, కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం అన్నారు. కమలాపురంలోని బిల్ట్ కార్మాగారం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నా రు. ఈ సందర్భంగా జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మునిగాల విలియం మాట్లాడుతూ కొత్తపరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం బిల్ట్ కర్మాగారం సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కర్మాగారంలో ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 10 వేల మంది కార్మికులు ఉపాధి కరువై రోడ్డున పడినా ప్రభుత్వాలు చొరవచూపకపోవడం చాలా దారుణమన్నారు. కార్మాగారం మూతపడడంతో 10 నెలల నుంచి ఉపాధి కరువై సుమారు 8 వేల మంది కార్మికుల కుటుంబాలు విలవిల్లాడుతున్నాయని, అరుునా సమస్యను పరిష్కరించడంలో ఎంపీ లు, మంత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తుండడం శోచనీయమన్నారు. ఇప్పటికే సుమారు 5వేల మంది బిల్ట్ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ట్ విషయాన్ని అసెంబ్లీ, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. అవసరమైతే జగన్మోహన్రెడ్డిని కమలాపురానికి తీసుకువచ్చి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడిగంటి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత రాజ్‌కుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు ముని గాల కల్యాణ్‌రాజ్, సేవాదల్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, ప్రోగ్రాం ఆర్గనైజర్ అ ప్పం కిషన్, అధికార ప్రతినిధి పుల్యాల గాం ధీ, మొగిళ్లపల్లి మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు రజనీకాంత్, సతీష్, పప్పు రాజిరెడ్డి, ఎండీ. కైసర్, ఆనంద్, ఎస్కే.గౌస్, ఎస్డీ సయ్యద్, మాదిరి నరేష్ బిట్టు, జేఏసీ నాయకులు చాతరాజు చొక్కారావు, వడ్డెబోయిన శ్రీనివాస్, కుర్బాన్‌అలీ, జోగినపల్లి వెంకట్రావు, డీవీపీ రాజు, పాకనాటి వెంకట్రావు, కొడాలి మల్లీశ్వర్రావు పాల్గొన్నారు. -
‘చలో హైదరాబాద్’కు పోలీసుల బ్రేక్
* బిల్ట్ కార్మికులను రాజధానికి వెళ్లకుండా నిలిపివేసినఖాకీలు * రాత్రి ఒంటి గంట వరకు రోడ్డుపైనే కార్మికులు కమలాపురం : బిల్ట్ పరిశ్రమ మూతపడకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు బయల్దేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు బయల్దేరిన తమను పోలీసులు అడ్డుకోవడమేమిటని కార్మికులు మండిపడ్డారు. ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. కమలాపురం నుంచి కార్మికులు హైదరాబాద్ వెళ్లేందుకు 5 బస్సులను అద్దెకు మాట్లాడగా.. మంగళవారం రాత్రి 10 గంటలకు బస్సులు కమలాపురం చేరుకున్నాయి. కార్మికులు రాత్రి బస్సు ఎక్కి బయల్దేరుతున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు వచ్చి బస్సులకు అడ్డం తిరిగి నిలిపివేశారు. దీంతో నాయకులు కార్మికులు అవాక్కయ్యారు. బస్సులు వెళ్లేందుకు అనుమతి లేదని, వెంటనే ఇక్కడి నుంచి కార్మికులు వెళ్లిపోవాలని మంగపేట ఎస్సై ముష్కం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా కార్మిక సంఘాల నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ములుగు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్‌కు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బస్సులు ఖాళీగా తిరిగి వెళ్లిపోగా కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిది నెలలుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఎన్నుకుంటే నాయకులు నట్టేట ముంచారని పలువురు ఆరోపించారు. అసెంబ్లీ చర్చల్లో ఖాయిలాపడుతున్న పరిశ్రమలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చర్చిస్తుంటే.. బిల్ట్‌పై మాత్రం జిల్లాకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న తమపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరికాదని వాపోయూరు. పోలీసు నిర్బంధం ప్రయోగించడంలో యూజమాన్యం హస్తం ఉందని కూడా మండిపడ్డారు. ఇందుకు స్థానికంగా ఉన్న కొందరు బిల్ట్ అధికారులను వాడుకుంటోందని ఆరోపించారు.