సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
- వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
- భీంరెడ్డికి నివాళులర్పించినసజ్జల రామకృష్ణారెడ్డి
వరంగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. హన్మకొండ రెడ్డికాలనీలో శుక్రవారం జరిగిన సుధీర్‌రెడ్డి పెద్దకర్మకు ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యూరు.
సుధీర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డి, అన్న సుమన్‌రెడ్డిని ఓదార్చారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సుధీర్‌రెడ్డి మృతిని వైఎస్సార్ సీపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు.