సుధీర్ కుటుంబానికి అండగా ఉంటాం
రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. సుధీర్ కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. దివంగత యువ నాయకుడు సుధీర్ రెడ్డి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
సుధీర్ రెడ్డి మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలోనే సుధీర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ స్వయంగా పరామర్శిస్తారని శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేత సిద్దా రాఘవరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సుధీర్ అంత్యక్రియలకు హాజరవుతున్నారు.