‘ఆయనవి ఉత్తుత్తి దీక్షలే’ | MP Avinash Reddy Comments On Chandrababu | Sakshi

నేటితో వైఎస్సార్‌ జిల్లా వాసుల కల నెరవేరింది..

Dec 23 2019 12:58 PM | Updated on Dec 23 2019 2:08 PM

MP Avinash Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్‌ జిల్లా వాసుల కల నేటితో నెరవేరిందని ఎంపీ అవినాష్‌ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో పాటు స్టీల్‌ప్లాంట్‌ ఇస్తామని మోసం చేశారని.. గత ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనకు ముందే ముడిసరుకు కేటాయించారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

మడం తిప్పని నాయకుడు.. 
ప్రతిపక్ష నేత చంద్రబాబువి ఉత్తుత్తి దీక్షలేనని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి విమర్శించారు. మాట ఇస్తే మడం తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే..
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్టీల్‌ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని డిప్యూటీ సీఎం అంజాద్‌  బాషా అన్నారు. మూడేళ్లలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి 25 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. పాదయాత్రలో సీఎం జగన్‌  మాట ఇచ్చిన ప్రకారమే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా వాసుల కల నేడు నెరవేరిందన్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement