
సాక్షి, పులివెందుల: రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ల అభివృద్ధికి సీఎం జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. పులివెందుల బస్టాండ్ నిర్మాణ పనులకు ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డితో కలిసి ఎంపీ అవినాష్‌రెడ్డి గురువారం భూమిపూజ చేశారు.
అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై బాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలే. ఏది మాట్లాడిన ప్రజలు నమ్మేస్తారు అన్న ధోరణితోనే చంద్రబాబు పులివెందులలో ప్రసంగించారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
చదవండి: ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు
Comments
Please login to add a commentAdd a comment