12 న జగన్ పర్యటన
సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
సమావేశమైన వైఎస్సార్‌సీపీ నేతలు
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 12న వరంగల్‌కు వస్తున్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా నాయకుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో సుధీర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. పలు ప్రజా సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో చురుకైన నేతగా గుర్తింపు పొందారు. రాజకీయంగా ఒక్కోమెట్టు ఎక్కుతు న్న క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దానితో భీంరెడ్డి కుటుంబాన్ని ఓదార్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ కుటుంబంలో మనోధైర్యాన్ని నింపేందుకు 12న వరంగల్‌కు వస్తున్నారు.
ముఖ్యనేతల సమావేశం
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జి ల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా క మిటీ నాయకులు, సభ్యులు హన్మకొండలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భీంరెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీని జిల్లాలో బలోపే తం చేసే దిశగా చర్చించారు. ఈ సమావేశం లో పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, ము ని గాల విలియమ్స్, నాడెం శాంతికుమార్, అ ప్పం కిషన్, శంకరాచారి, సేవాదళ్ జిల్లా అ ధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాయిత రాజ్‌కుమార్‌లతోపాటు మహిపాల్‌రెడ్డి, దయాకర్, రజనీ కాం త్,ముజాఫరుద్దీన్‌ఖాన్,మాధవరెడ్డి, శ్రావ ణ్, అచ్చిరెడ్డి, తాజొద్దీన్, గాంధీ, శ్రీను, సంపత్, కృష్ణా, అగస్టీన్, వెంకట్రావు, లక్ష్మయ్య, యాక య్య, హరిప్రసాద్, అమర్ పాల్గొన్నారు.
నేడు నగర కమిటీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ సమావేశం నేటి మధ్యాహ్నం 3:00 గంటలకు సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ నివాసంలో జరుగుతుంది. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నాలని ఆ పార్టీ నాయకులు కోరారు.