కొత్త ప్రయత్నం | the end telugu movie Promotional | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయత్నం

Published Sun, Nov 2 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

కొత్త ప్రయత్నం

కొత్త ప్రయత్నం

సుధీర్‌రెడ్డి, యువచంద్ర, గజల్ ప్రధాన పాత్రధారులుగా రాహుల్ సాంకృత్యియాన్ దర్శకత్వంలో రూపొందిన హారర్ చిత్రం ‘ది ఎండ్’. కోటేశ్వరరావు మోరుసు నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో రచయిత కోన వెంకట్ విడుదల చేశారు. ఫార్ములా చిత్రాలు రాజ్యమేలుతున్న నేటి తరుణంలో వాటిని బ్రేక్ చేస్తూ ఇలాంటి చిత్రాన్ని తీసిన దర్శక, నిర్మాతలను కోన వెంకట్ అభినందించారు. ప్రస్తుతం చిన్న సినిమాల సీజన్ మొదలైందనీ, ‘ది ఎండ్’ చిత్రం ఈ టీమ్‌కి గొప్ప ఆరంభం కావాలని కోరుకుంటున్నాననీ కోన వెంకట్ ఆశాభావం వెలిబుచ్చారు. కొత్త ప్రయత్నం చేయాలనే తలంపుతో ఈ హారర్ చిత్రాన్ని నిర్మించామనీ, యూ ట్యూబ్‌లోని ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోందనీ, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామనీ దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement