పింఛన్లను తొలగించడమే సర్కారు లక్ష్యమా? | congress slams telangana government over pension check | Sakshi
Sakshi News home page

పింఛన్లను తొలగించడమే సర్కారు లక్ష్యమా?

Published Wed, Oct 15 2014 2:16 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

congress slams telangana government over pension check

కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ప్రభుత్వం.. అప్పుడు పేదలు ఎవరన్న విషయాన్ని గుర్తించలేదని అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ రేషన్ కార్డులు, పింఛను కార్డులను పరిశీలించడం, వాటిని క్రాస్ చెక్ చేసుకోవడం ఎందుకని ఆయన మండిపడ్డారు.

దరఖాస్తుల పేరుతో రేషన్ కార్డులను, పింఛను కార్డులను తొలగించడమే కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంలా కనిపిస్తోందని ఆయన అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకపోతే తాము ఇక ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement