
ఎల్బి నగర్ నియోజకవర్గం
ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన డి.సుధీర్ రెడ్డి 17251 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్ ప్రత్యర్ది రామ్మోహన్ గౌడ్‌పై గెలుపొందారు. సుధీర్ రెడ్డి 2009లో మొదటి సారి గెలవగా, 2018లో రెండో సారి గెలిచారు. అయితే ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే ఆయన అదికార టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. సుధీర్ రెడ్డికి 113117 ఓట్లు రాగా, రామ్మోహన్ గౌడ్‌కు 95766 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్, పరిసరాలలో అంతా టిఆర్‌ఎస్ ప్రభంజనం వీస్తే ఇక్కడ మాత్రం మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ ఐ గెలిచింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పేరాల శేఖర్ రావుకు 21500ఓట్లు వచ్చాయి.
రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుదీర్ రెడ్డి గతంలో కార్పొరేటర్‌గా కూడా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఎల్బినగర్ నియోజకవర్గంలో అనూహ్య విజయం సాధించారు. కృష్ణయ్య గట్టి పోటీలో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అయినా, ఆయన టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా ఘన విజయం సాధించడం విశేషం. కృష్ణయ్య తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ధి రామ్మోహన్ గౌడ్‌పై 12525 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బిసి నేత గెలిచారు.
ఎల్బి నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..