L B Nagar
-
ఎల్బి నగర్ నియోజకవర్గంను జయించేది ఎవరు..?
ఎల్బి నగర్ నియోజకవర్గం ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన డి.సుధీర్ రెడ్డి 17251 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ ప్రత్యర్ది రామ్మోహన్ గౌడ్‌పై గెలుపొందారు. సుధీర్ రెడ్డి 2009లో మొదటి సారి గెలవగా, 2018లో రెండో సారి గెలిచారు. అయితే ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే ఆయన అదికార టిఆర్ఎస్లో చేరిపోయారు. సుధీర్ రెడ్డికి 113117 ఓట్లు రాగా, రామ్మోహన్ గౌడ్‌కు 95766 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్, పరిసరాలలో అంతా టిఆర్ఎస్ ప్రభంజనం వీస్తే ఇక్కడ మాత్రం మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ ఐ గెలిచింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పేరాల శేఖర్ రావుకు 21500ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుదీర్ రెడ్డి గతంలో కార్పొరేటర్‌గా కూడా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఎల్బినగర్ నియోజకవర్గంలో అనూహ్య విజయం సాధించారు. కృష్ణయ్య గట్టి పోటీలో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అయినా, ఆయన టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా ఘన విజయం సాధించడం విశేషం. కృష్ణయ్య తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి రామ్మోహన్ గౌడ్‌పై 12525 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బిసి నేత గెలిచారు. ఎల్బి నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
హైదరాబాద్ మెట్రో.. పని వేళల్లో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం మెట్రో రైలు సేవలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం మెట్రో కార్యకలాపాలు గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించబడతాయి. మొదటి దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా కారిడార్ 1లో (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రెండో దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3లో (నాగోల్ నుంచి రాయదుర్గ్) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు మొదటి దశ మాదిరిగానే ఉంటాయి. (చదవండి: మెట్రో రీ ఓపెన్.. ఫైన్ల మోత) ఇక మూడవ దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో భాగంగా మూడు కారిడార్లలో(సీ1, సీ2, సీ3) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక వీటి రెవెన్యూ సేవలు కేవలం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణీకుల రద్దీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇక కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అలాగే గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లు మూసివేత కొనసాగుతుంది -
షట్టర్ పగలగొట్టి దోచుకెళ్లారు
ఎల్బీనగర్లోని ఆర్ ఆర్ కలర్ ల్యాబ్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ల్యాబ్ షట్టర్ పగలగొట్టి అందులో ఉన్న రూ. 60 వేల నగదును దోచుకెళ్లారు. సోమవారం ఉదయం గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వంట కూడా చేసుకోలేక అవస్ధలు