జగనన్నకు బ్రహ్మరథం
సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌కు నీరాజనం
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారి వరంగల్ నగరానికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జనగామ మండలం పెంబర్తి వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియమ్స్, నాయకులు కల్యాణ్‌రాజ్, నాడెం శాంతికుమార్‌లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద కాన్వాయ్ ఆపి మహిళలు, వృద్ధులను జగన్ అప్యాయంగా పలకరించారు. ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికాయి. మడికొండ, ఖాజీపేట, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్డు, పెద్దమ్మగడ్డ మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ భీంరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పరామర్శ తర్వాత ఖాజీపేట మీదుగా మళ్లీ హైదరాబాద్‌కు బయలుదేరారు. భీంరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసం వద్ద, బాల వికాస సంస్థ ఆవరణలో జగన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పోటీపడ్డారు. అందరితో అప్యాయంగా మాట్లాడుతూ జగన్ ముందుకు సాగారు.
సుధీర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా..
సుధీర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సుధీర్‌రెడ్డి ఇంట్లో దాదాపు గంట సేపు ఉన్నారు. ‘సుధీర్‌రెడ్డి మరణం వైఎస్సార్ సీపీకి, వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. అంకితమైన నాయకుడిని కోల్పోయాం. సుధీర్‌రెడ్డి మా కుటుంబానికి ఆప్తుడు’ అని వైఎస్ జగన్ అన్నారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డి.. సోదరుడు సుమన్‌రెడ్డితో మాట్లాడారు. నేనున్నాంటూ జగన్, సుధీర్‌రెడ్డి తల్లిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గున్నం నాగిరెడ్డి, వి.వెంకటేశ్, జి.సూర్యనారాయణరెడ్డి, కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, సిద్దార్థరెడ్డి, మునిగాల విలియం, ఎడ్మ క్రిష్ణారెడ్డి, భీష్వ రవీందర్, ఎం.జయరాజ్, సయ్యద్ ముస్తఫా, వెల్లాల రామ్మోహన్, సాదమల్ల నరేశ్, నర్రా భిక్షపతి, పి.ప్రపుల్ల, వి.ఎల్.ఎన్.రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, ఇరుగు సునీల్‌కుమార్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్, సురేశ్‌రెడ్డి, ఎస్.భాస్కర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, అమిత్‌ఠాగూర్, మశ్రం శంకర్, జి.జైపాల్‌రెడ్డి, మునిగాల కళ్యాణ్, శివ, దయాకర్ పాల్గొన్నారు.
బాల వికాస సంస్థకు..
వరంగల్‌లోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాద పూర్వకంగా వెళ్లారు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్‌మెంట్’ శిక్షణ కార్యక్రమానికి వచ్చిన 11 దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ‘బాల వికాస సంస్థ చేపట్టిన పథకాలతో చాలా గ్రామాల్లో ప్రజలు లాభపడుతున్నారు. బాల వికాస సంస్థ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వాలకు నమూనాగా ఉండడం అభినందనీయం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటుండడం చూస్తుంటే బాల వికాస పనితీరును అర్థం చేసుకోవచ్చు.
కులమత రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలు చేస్తున్న సంస్థ వ్యవస్థాపకురాలు బాల థెరిసాకు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.శౌరిరెడ్డికి, సంస్థలో పని చేస్తున్నవారికి అభినందనలు. బాల వికాస సంస్థ మరింత విస్తతంగా సేవలు చేస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఆకాక్షిస్తున్నా’ అని అన్నారు. బాల వికాస స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న తెలంగాణలో 500, ఆంధ్రప్రదేశ్‌లో 100 తాగునీటి వాటర్ ప్లాంట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేలా ప్రభుత్వాలని ఒప్పించాలని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి ఈ సందర్భంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో రెండు సార్లు తమ సంస్థకు వచ్చారని శౌరిరెడ్డి తెలిపారు. రాజశేఖరరెడ్డి దారిలోనే ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ సంస్థకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.