
హరీశ్.. అహంకారం వద్దు: సుధీర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అహంకారంతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడటం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరిం చారు. కాంగ్రెస్ నేత ఎన్.శ్రీధర్‌తో కలసి గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు నేతలు లేరని, భవిష్యత్తు లేదని హరీశ్‌రావు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్‌లో చేరుతానని తిరిగిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారని, అందుకోసం పైరవీలు చేసుకున్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.