తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారని పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
వరంగల్: తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారని పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ సీపీ తరపున ఆదివారం ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. వరంగల్ ఉపఎన్నికలో ప్రజలు వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.