
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గైర్హాజర య్యారు. ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్, వరంగల్‌లో నిర్వహించిన బహి రంగ సభల్లో ఆయన ప్రసంగించాల్సి ఉన్నా, ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం కార ణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా సభల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నా రు.
అమిత్‌షా మొదటి సమావేశాలే రద్దవడం తో పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నెల 6న నల్లగొండ, హైదరాబాద్‌లో జరిగే సభలకు హాజరవుతారా లేదా అన్న దానిపై పార్టీ శ్రేణుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. నేడు కేంద్ర మంత్రి సుష్మా çస్వరాజ్ రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఇం టలెక్చువల్స్, ప్రొఫెషనల్స్‌తో జరిగే సమావే శంలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment