రిజర్వేషన్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు | CM not sincere towards downtrodden | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు

Published Fri, Apr 21 2017 2:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

రిజర్వేషన్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు - Sakshi

రిజర్వేషన్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు

బలరాం నాయక్‌
సాక్షి, హైదరాబాద్‌:  గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్త శుద్ధి లేదని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నిజంగా కేసీఆర్‌కు చిత్త శుద్ధి ఉంటే ముందుగా రాష్ట్రంలో వాటిని అమలు చేశాక కేంద్రానికి పంపి ఉండేవార న్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులను దేశంలోనే నంబర్‌ వన్‌గా మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌ అని ఆరోపించారు. కేసీఆర్‌కు రైతు సమస్యలను పరిష్కారించాలనే చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ నేత దొంతు మాధవరెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పుడో రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామనడం కాదని, ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement