సాక్షి, వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఘోరంగా తడబడ్డారు. వరంగల్ కేంద్రంలో శుక్రవారం జరిగిన భేటీలో గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించే క్రమంలో.. తప్పు తప్పుగా మాట్లాడారు. దీంతో సొంత నేతల మధ్య నవ్వులపాలయ్యారు.
తొలుత.. కాంగ్రెస్ అధికారంలోకి ఏం ఏం చేస్తుందనేది చెబుతూ పోయారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తే రూ. 5 వేలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆపై నేతలు అప్రమత్తం చేయడంతో.. రూ.500కేనంటూ మాట్లాడారు. ఇక బీజేపీ ప్రభుత్వం రూ. 12, 000 గ్యాస్ సిలిండర్ ఇస్తోందని అనడం.. వెనక నుంచి సరిదిద్దే యత్నం చేశారు. ఒకవైపు కార్యకర్తల గోల మధ్య ప్రసంగం కొనసాగిస్తున్న ఆయన.. అలా తడబడినట్లు అర్థమవుతోంది.
కానిస్టేబుల్ అయిన బలరాం నాయక్.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి ఎన్నికయ్యారాయన. మన్మోహన్‌సింగ్ కేబినెట్‌లో కేంద్రమంత్రి(సహాయ) గా పని చేశారు కూడా.
ఇదీ చదవండి: వరద సాయం.. ఇట్లనేనా ఉండేది రిపోర్ట్?
Comments
Please login to add a commentAdd a comment