కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు | Congress, the backwardness of tidipitone | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు

Published Fri, Mar 28 2014 3:43 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు - Sakshi

కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు

మహబూబాబాద్/నర్సంపేట/జనగామ, న్యూస్‌లైన్ :  తెలంగాణ అన్ని విధాలుగా వెనుకబడటానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కార ణం.. ఆ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్, నర్సంపేట, జనగామ పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మానుకోటలో హరీష్‌రావు మాట్లాడుతూ బయ్యారం లో ఉక్కు పరిశ్రమకు అవసరమైన వనరులు న్నా ఏర్పాటు చేయలేదు.. కేంద్రమంత్రి బలరా మ్ నాయక్ గిరిజనుడై ఉండి, గిరిజన సమస్యలను పట్టించుకోలేదు.. మానుకోట అన్ని విధా ల అభివృద్ధి కుంటుపడటానికి పాలకుల నిర్లక్ష్య మే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటున్న తరుణంలో పార్టీని బతికించుకోవడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టం ఇచ్చిందన్నారు.

తెలంగాణ కోసం సీపీఐ కూడా ఉద్యమించిందని తెలిపా రు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మానుకోటలో ఐటీడీఏ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏడాదిలోపే తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సీపీఐ నాయకులు మడత కాళిదాస్, తమ్మెర విశ్వేశ్వరరావు, విజయ్‌సారథి, అజయ్, టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, బానోత్ రవికుమార్, జి.అంజయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి అనిత నెహ్రూనాయక్, శంకర్‌నాయక్, సంగులాల్, నెహ్రూనాయక్, జిన్నారెడ్డి పద్మజ, జేరిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
 
వారిని గెలిపిస్తే గులాంగిరీ చేస్తరు..
 
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే చంద్రబాబు వద్ద, కాంగ్రెస్ వారిని గెలిపిస్తే ఢిల్లీలో గులాంగిరీ చేస్తారే తప్ప ప్రజలను పట్టించుకోర ని హరీష్‌రావు విమర్శించారు. నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలవూలలు వేసి నివాళులర్పించిన అనంతరం రోడ్ షోలో మాట్లాడారు. నర్సంపేటలో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్‌లుగా పాలించి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించని మీరు ఏం ముఖా లు పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం రాకుండా టీడీపీ నాయుకులు అడ్డుకుని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఆయున వెంట పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీతారాంనాయుక్, రాంచాం దర్ నాయుక్, శ్రీజానాయుక్, నయీమొద్దీన్, వుర్రి యూదవరెడ్డి, శరత్‌చంద్ర, ఎంవీ.రావూరావు, నంద్యాల కృష్ణారెడ్డి, మోతె జైపాల్‌రెడ్డి, నారుుని నర్సయ్యు, కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, పుట్టపాక కువూరస్వామి, వుచ్చిక నర్సయ్యు, వూజీ సర్పంచ్ గుంటి కిష న్, దార్ల రవూదేవి, గుండె బోరుున కొంరయ్యు, తదితరులు పాల్గొన్నారు.
 
జనగామకు ‘పొన్నాల’ చేసిందేమీ లేదు
 
మంత్రిగా పదేళ్లపాటు కొనసాగిన ప్రస్తుత టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామ అభివృద్ధికి చేసిందేమి లేదు.. ఆడుకుందామంటే క్రీడా మైదానం లేదు.. కూర్చుందామంటే పార్కులేదు.. మోరీలు లేవు.. దోమలను చూసి ఇక్కడోళ్లకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత హరీష్‌రావు విమర్శించారు. రాత్రి జనగా మ పట్టణంలోని 1, 11 వార్డుల్లో నిర్వహించి న రోడ్‌షోలో మాట్లాడారు.

రాష్ట్ర పునర్నిర్మాణం లో భాగంగా తెలంగాణను 24 జిల్లాలుగా.. అందులో జనగామన జిల్లా కేంద్రంగా చేసి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పా రు. కేసీఆర్‌ది కుటుంబపాలన అని విమర్శించే ముందు తన పరిస్థితి ఏమిటో పొన్నాల ఆలోచించుకోవాలన్నారు. కూట్లో రాయి తీయనోడు యేట్లో రాయి తీస్తాడా అని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలకు అవకాశం ఇచ్చాం.. అభివృద్ధి జరుగలేదు.. ఒక్కసారి టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూసిప్తామని హరీష్‌రావు అన్నారు.

రైతులకు 8 గంటల కరెంటు, ఎస్టీలకు ఉద్యోగ, విద్యలో 12 శాతం రిజర్వేషన్, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బక్క నాగరాజు, ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఉల్లెంగల కృష్ణ, ఆలూరి రమేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement