సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం తన సెల్‌ఫోన్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒక అడుగు ముందే ఉండే హరీశ్‌రావు, లాక్‌డౌన్ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ స్థితిగతులపై సెల్‌ఫోన్ నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులతో తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా లాక్‌డౌన్‌లో ప్రజల సహకారం, కరోనా నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విధులు, పట్టణంలో పెండింగ్‌లోని పనుల వివరాలు, కరోనా నివారణకు ప్రతిరోజూ హైపోక్లోరైడ్ స్ప్రే స్థితిగతులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెత్త సేకరణతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్ ఈఈ ప్రతాప్, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఓఎస్‌డీ బాల్‌రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు సత్యనారాయణ, సతీష్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment