Cleanliness
-
ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. ఒక టీచర్, క్లాస్ రూమ్‌లో కొన్ని వస్తువులను చిందర వందరగా వేయడమే కాకుండా, చైర్స్‌ను కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తుంది. ఆ తరువాత పిల్లలను అక్కడికి తీసుకు వస్తుంది. పిల్లలందరూ అక్కడున్న వస్తువులను యధాస్థానాల్లో చేర్చేస్తారు. ఈ వీడియో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఈ వీడియా షేర్ చేస్తూ ఏం ఐడియా.. చిన్నప్పుడే పరిశుభ్రత, చక్కదనం వంటి వాటి గురించి అలవాటు చేస్తున్నారు, మనం కూడా మన ఫ్రీ, ఎలిమెంటరీ స్కూల్స్‌లో చేయగలమా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది, వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. What an idea… This is how to embed cleanliness & tidiness & collaboration in our basic nature. Can we make this practice a standard part of pre and elementary schools?? pic.twitter.com/APeVw4AKWL — anand mahindra (@anandmahindra) January 7, 2024 -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
ప్రాథమిక పరిశుభ్రతపై పిల్లలకు వర్క్ షాప్
సాక్షి, హైదరాబాద్: రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు. సెసేమ్ వర్క్‌షాప్-ఇండియా, సెసేమ్ వర్క్‌షాప్ యొక్క భారతీయ విభాగం, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నాన్ ప్రాఫిట్ మీడియా, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, హైజీన్ అండ్ బిహేవియర్ చేంజ్ కోయలిషన్ (HBCC)తో కలిసి ప్రజలలో 'చేతి పరిశుభ్రత, వ్యాధుల నివారణ' గురించి అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు. 'తినే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు. పిల్లలు, కుటుంబాలలో పరిశుభ్రత జ్ఞానం, వైఖరులు, అభ్యాసాలను ప్రోత్సహించడం, అభివృద్ధి అవసరాలను తీర్చడం మా లక్ష్యం' అన్నారు. ఈ విషయం మనందరికీ చిన్నప్పటి నుంచి నేర్పుతున్నదే ఐనప్పటికీ కోవిడ్ మహమ్మారి ప్రారంభంతో, అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఈ ప్రాణాలను రక్షించే అలవాటును సాధారణ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం మరింత ముఖ్యమైందిగా మారిందని పేర్కొన్నారు. చదవండి: జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం -
ఫ్లోర్ క్లీనర్లు, ఫ్రెష్నర్లతో ప్రమాదం.. డేంజర్ అని తెలిసినా ఎడాపెడా వాడకం
దోమల్ని తరిమేసేందుకు కాయిల్ లేదా రీఫిల్.. గచ్చును శుభ్రం చేసేందుకు ఫ్లోర్ క్లీనర్.. గ్యాస్ స్టవ్‌పై మరకల్ని తుడిచేందుకు క్రీమ్.. బాత్రూమ్ను శుభ్రం చేసేందుకు ఓ ద్రవం.. టాయిలెట్‌ను శుద్ధి చేసేందుకు మరో రసాయనం.. సువాసన వెదజల్లేందుకు రూమ్ ఫ్రెష్నర్స్.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఇంట్లో డజనుకు పైగా రసాయన ఉత్పత్తులు వినియోగించడం పరి పాటిగా మారిపోయింది. ఇవే ప్రజల పాలిటి శాపంగా మారుతున్నాయి. ఇలాంటి వాటిని వినియోగించడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాక్షి, అమరావతి: ఇంట్లో పరిశుభ్రత.. సువాసన కోసం వాడే వాణిజ్య ఉత్పత్తుల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. వీటి వాడకం వల్ల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నట్టు వెల్లడైంది. ఆయా ప్యాకెట్లు, డబ్బాలపై ‘ఇది విషం. ఇంట్లో పిల్లలకు దూరంగా ఉంచాలి’ అని.. దీనిని ‘మండే గుణం ఉంది’ అని జాగ్రత్తలు రాసి ఉన్నా.. వాటిని పట్టించుకునేవారు 10% కూడా ఉండటం లేదు. సామాజిక మాధ్యమాల్లో సినీ తారలతో సైతం ఆయా కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అందుకే విదేశాల్లో నిషేధం విధించిన వాణిజ్య ఉత్పత్తులు సైతం మనదేశంలో విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. ఇంటి పరిశుభ్రత కోసం, సువాసన కోసం వాడే వాణిజ్య ఉత్పత్తుల వినియోగం పరిమితి దాటుతోందని, వీటివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. పట్టణాల్లో మరీ ఎక్కువ మనదేశంలో అతి శుభ్రత, ఇంట్లో కొత్త అలవాట్లను ప్రవేశ పెట్టడంలో పట్టణ ప్రజలే ముందున్నారని సీఎస్ఈ పేర్కొంది. కొన్నేళ్లుగా తడి, పొడి చెత్తతోపాటు ఈ వేస్ట్‌పై ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనతో చాలావరకు మార్పు వచ్చినా.. ఇంటి శుభ్రత కోసం ప్రమాదకర రసాయనాల వాడటం మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించింది. ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా అందుతున్న చెత్తలో నెలకు సగటున ఒక్కో ఇంటి నుంచి 5 కేజీలకు పైగా వాడేసిన ఫ్లోర్ క్లీనర్లు, యాసిడ్ బాటిళ్లు, రూమ్ ఫ్రెష్నర్స్, మస్కిటో రీఫిల్స్, పెయింట్లు, వార్నిష్ డబ్బాలు, గడువు ముగిసిన మందులు వంటివి వస్తున్నట్టు గుర్తించారు. ప్రమాదకరమైన గృహ వ్యర్థాలలో పారేసిన పెయింట్ డబ్బాలు, పురుగు మందుల డబ్బాలు, సీఎఫ్ఎల్ బల్బులు, ట్యూబ్‌లైట్లు, విరిగిన పాదరసం థర్మామీటర్లు, సిరంజీలు పట్టణ గృహాల నుంచి సేకరించే చెత్తలో అధికంగా వస్తున్నట్టు గుర్తించారు. ఇవన్నీ పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని వేగంగా దెబ్బతీసేవే. మనదేశంలో పెస్ట్ కంట్రోల్ సెంటర్లకు వస్తున్న కాల్స్ సైతం ఏటా పెరుగుతున్నాయని, 2012లో రోజుకు 7.6 కాల్స్ వస్తే.. 2022లో 23కు చేరినట్టు సీఎస్ఈ గుర్తించింది. బొద్దింకలు, బల్లులు, చెద పురుగులు వంటి వాటి నిర్మూలన కోసం అత్యంత విషపూరితమైన రసాయనాలను ఇంట్లో వాడుతున్నట్టు తేలింది. సంప్రదాయ విధానాలే మేలు అమెరికాలో సగటున ప్రతి కుటుంబం వాడే క్లీనర్స్‌లో 3 నుంచి 11 నుంచి 38 లీటర్ల విష పదార్థాలు ఉన్నట్టు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది. ఇవి గాలిలో కలిసినప్పుడు ప్రమాదకర అవశేషాలను విడుదల చేస్తాయని పేర్కొంది. ఆ సంస్థ దాదాపు 2 వేలకు పైగా శుభ్రపరిచే ఉత్పత్తులను పరిశీలించగా, వాటిలో 10 శాతం పైగా విషపూరితమైనవిగా గుర్తించింది. అత్యంత ప్రమాదకరమైన ఉత్పత్తులను ప్రభుత్వం రద్దు చేయగా.. మిగిలిన వాటిపై ‘హెచ్చరిక, జాగ్రత్త, ప్రమాదం, విషం’ అన్న పదాలను పెద్దగా ముద్రించేలా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోనూ ఇలాంటి ఉత్పత్తులే ఉన్నాయని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా సహజ మార్గాలను అనుసరించాలని సీఎస్ఈ విజ్ఞప్తి చేస్తోంది. డ్రెయిన్ శుభ్రం చేసేందుకు ప్లంగర్ లేదా ప్లంబర్ స్నేక్, అద్దాల శుభ్రతకు వెనిగర్ లేదా నిమ్మరసం వంటివి వాడాలని సూచిస్తోంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వంటగది, బాత్రూమ్, హాల్, పడక గదుల్లో సగటున ఒక్కో ఇంటిలో 8 కేజీల వరకు ప్రమాదకర రసాయనాలు, పౌడర్లు వినియోగిస్తున్నారు. డ్రెయిన్ క్లీనర్లు, ఓవెన్ శుభ్రం చేసుకునేవి, ఫ్లోర్ క్లీనర్లు వంటి వాటిలోని రసాయనాలు ఇంట్లోని వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నట్టు సీఎస్ఈ గుర్తించింది. పెద్దవారు వాడే డియోడరెంట్లు, బాడీ స్ప్రేలతో ఇంట్లోని పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది. వీటి వినియోగం వల్ల వెంటనే చర్మం, కళ్లు మండటంతో పాటు దీర్ఘకాలంలో పిల్లల్లో ఆస్తమా వంటి రోగాలు కనిపిస్తున్నట్టు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) ప్రకటించింది. పిల్లల్లో కనిపిస్తున్న ఊపిరి సంబంధింత సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారు గతంలో రెండు మూడు శాతం ఉండగా.. అది 10.4 శాతానికి పెరిగినట్టు తేలింది. -
వందే భారత్‌లో స్వచ్ఛతకు మంగళం
సాక్షి, విశాఖపట్నం : ఓవైపు ఇండియా.. స్వచ్ఛతలో ప్రపంచ దేశాలకు దిక్సూచీగా మారేందుకు పరుగులు పెడుతుంటే.. కొందరిలో మాత్రం పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో అవగాహన కొరవడుతోంది. ఇటీవల ప్రారంభమైన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్‌లో పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చిన వందేభారత్ రైలులో టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. విరిగిన కుర్చీ తినుబండారాలు కిందపడేస్తూ రైలులోని ప్రతి కోచ్‌ను అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు. విశాఖ వచ్చేసరికి వందేభారత్ రైలు కాస్తా చెత్తబుట్టగా మారిపోతుంది. విషయం తెలుసుకున్న వాల్తేరు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ఆవేదన వ్యక్తం చేశారు. రైలును పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత రైల్వే సిబ్బందిపైనే కాకుండా.. ప్రతి ఒక్క ప్రయాణికుడిపైనా ఉందని సూచించారు. చదవండి: స్వచ్ఛ జల్ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ -
మానసిక ఆరోగ్యం మీ గదే మీ మది
చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. కేస్ స్టడీ 1: సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ నీట్‌గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది. కేస్ స్టడీ 2: రాజేశ్వరి ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్‌పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్ ఆఫ్. ఇలా రోజు జరగడం అవసరమా? కేస్ స్టడీ 3: సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్‌లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో. రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి. 1. ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్‌గా సర్దుకోవచ్చు. 2. లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్ఫెక్ట్గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత. 3. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది. 4. ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్‌లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్‌గా చేసుకుంటూ రావడమే మంచిది. 5. పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది. -
పరిశుభ్రం చేసే చేతులే పరిశుద్ధమైనవి
మన ఇంట్లో పాసిపోయిన అన్నం దగ్గర్నుంచి, ఇంట్లో వూడ్చిపారేసిన మకిల వరకు తీసుకెళ్లి వాటిని ఊరి చివరనున్న డంపింగ్‌యార్డులకు తరలిస్తున్న ఆ చేతులెవరివి తల్లీ! తడిచెత్తను, పొడిచెత్తను వేరుచేస్తున్న ఆ చేతులెవరివి తండ్రీ! వాళ్లకు పాదపాదాన పరిపరి దండాలు. ప్రతి నిత్యం ‘అమ్మా, చెత్తబండి వచ్చింది’ అని పలకరిస్తున్న సమాజ ఆరోగ్య దూతల పరిశుభ్ర చేతుల వల్లనే పల్లెల దగ్గర్నుంచి హైదరాబాద్ మహానగరం వరకు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఈ సఫాయి కార్మికులే మన ఆరోగ్య కార్యకర్తలు. వారి సేవలకు వెల కట్టలేం కానీ వారిని ఆదుకోవాలన్న, వారికి అన్నిరకాల సదుపాయాలను అందించాలన్న తలంపు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో పాత పేపర్లు ఏరుకుని జీవించే వాళ్లంతా కలిసి ఇందిరాపార్కు దగ్గర ధర్నాచేశారు. అది ఉద్యమ చరిత్రలో మరిచిపోలేనిది. వీళ్లు చేసే కృషిని గమనించిన కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వీరి జీవనవిధానంలో మార్పులు తెచ్చేందుకు పథక రచన చేశారు. ఈ ఆలోచననే కేటీఆర్ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. చిన్నప్పుడు మా నడిగూడెంలో ‘నమో వెంకటేశా’ అన్న దేవాలయంలోని పాటో, అల్లాహు అక్బర్ అంటూ మసీదు నుంచి వచ్చే ప్రార్థనా గీతమో, చర్చి గంటలో మేలుకొలిపేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో పొద్దున్నే అందర్నీ లేపేది మాత్రం జీహెచ్ఎంసీ వాహనం నుంచి వచ్చే పాటే. అది ఏ మతానికి చెందిన పాట కాదు. సర్వమానవుల్ని ఆరోగ్యవంతులుగా ఉండమని దీవించి మేలుకొలిపే పాట. ‘పరిశుభ్రత చల్లని రాగం/ పరిశుభ్రత గుండెలోరాగం/ పరిశుభ్రత జీవనవేదం/పరిశుభ్రత వైపుకే పయనం’ అంటూ పాట మొదలవుతుంది. ‘తడిచెత్త, పొడిచెత్తను ఎరువుగా చేసి.../ ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం/ ... ఇంటింటికి ఒక మొక్క నాటుదాం/ స్వచ్ఛదేవా .../ ఆరోగ్య దేవతా .../ స్వచ్ఛ్ హైదరాబాద్/ స్వచ్ఛ్ తెలంగాణ’ అంటూ ముగిసేపాట పరిశుభ్ర దేవతను కొలుస్తూ పాడే పరిశుద్ధ గీతంలాగా ఉంటుంది. హిమాయత్‌నగర్‌లోని ఎమ్.ఎస్.కె. టవర్స్‌కు ప్రతిరోజు గువ్వల రంగడు ఆటోట్రాలీతో వస్తాడు. ఇందులో 80కి పైగా నివాస గృహాలున్నాయి. ప్రతిరోజు రంగడు తన భార్య సుజాతతో కలిసి 500 ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను తీసుకెళతాడు. ఈ భార్యభర్తలిద్దరూ ఐదు గంటలకే ‘మనం మారుదాం మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం’ అన్న నినాదమున్న ఆటోట్రాలీతో వస్తారు. ఇలా గువ్వల రంగడి వాహనంలాగా జీహెచ్ఎంసీ పరిధిలో 4000కు పైగా ఆటో టిప్పర్లను ప్రభుత్వమే సబ్సిడీ కింద అందించింది. 4,50,000 రూపాయల ఖరీదైన ఆటోటిప్పర్ను, 1,50,000 చెల్లిస్తే లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ అందించింది. ఈ వృత్తి ద్వారా అతనికి నెలకు అన్ని ఖర్చులు పోను 5 నుంచి 10 వేలు మిగులుతాయంటున్నాడు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన కేటీఆర్ ఆరోగ్య తెలంగాణకు నమూనాగా మొత్తం తెలంగాణలోని పట్టణాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దే కీలకమైన కర్తవ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేస్తున్నారు. ఆటోట్రాలీలు నడిపేవాళ్లు, చెత్తను మోసుకుపోయేవాళ్లు, పొరకల తల్లులకు, తండ్రులకు కొండంత అండగా తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుందన్న విశ్వాసం ఆ వర్గాల్లో బలంగా ఉంది. మా పిల్లలందరూ చదువుకునేందుకు గురుకులాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించి సీట్లివ్వాలని వాళ్లు కోరుతున్నారు. మహానగరాన్ని పరిశుభ్రం చేస్తున్న ఆ తల్లులు, తండ్రుల బిడ్డలు తెలంగాణ ప్రభుత్వానికున్న సామాజిక దృక్కోణపు చూపుడువేలు సాక్షిగా గురుకులాల్లోంచి ఉన్నత స్థానాలకు ఎదిగే శక్తిమంతులవుతారు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
మొబైల్ ఫోన్లో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం తన సెల్‌ఫోన్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒక అడుగు ముందే ఉండే హరీశ్‌రావు, లాక్డౌన్ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ స్థితిగతులపై సెల్‌ఫోన్ నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులతో తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా లాక్డౌన్లో ప్రజల సహకారం, కరోనా నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విధులు, పట్టణంలో పెండింగ్‌లోని పనుల వివరాలు, కరోనా నివారణకు ప్రతిరోజూ హైపోక్లోరైడ్ స్ప్రే స్థితిగతులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెత్త సేకరణతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్ ఈఈ ప్రతాప్, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఓఎస్డీ బాల్‌రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సతీష్‌లు పాల్గొన్నారు. -
పరిశుభ్రతే.. శ్రీరామ రక్ష!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే కనీసం ప్రతి 20 నిమిషాలకోసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్న సూచనను పెడచెవిన పెడుతున్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే... కడిగి కడిగి చేతులు అరిగిపోతాయ్ జాగ్రత్త అని జోకులేసేవారికి అయితే ఇది చాలా ముఖ్యం కూడా. మనకు తెలియకుండానే మన చేతులు మన ముఖాన్ని, ముఖ భాగాలను టచ్ చేస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేల్లో వెల్లడయిన విషయాల ప్రకారం ఒక గంటకు మనం మన ముఖాన్ని ఎన్నిసార్లు తాకుతామో తెలిస్తే అవాక్కవక తప్పదు!. ప్రతి గంటకు ఎన్నిసార్లు మనం మన ముఖాన్ని, ముఖ భాగాలను తాకుతామో తెలుసా... సగటున 23 సార్లు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?.. ఆస్ట్రేలియాలోని ఓ విశ్వవిద్యాలయం తన మెడికల్ విద్యార్థులపై నిర్వహించిన సర్వే ఫలితం నిజమో కాదో తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. లేదంటే ఇతరులను నిశితంగా గమనించండి... అప్పుడయినా చేతులు శుభ్రంగా కడుక్కోండి... కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. దాదాపు అన్ని భాగాలు... ప్రతి వ్యక్తి తన ముఖాన్ని గంటకు ఎన్నిసార్లు తాకుతారన్నదానిపై ఆస్ట్రేలియాలోని ఓ విశ్వవిద్యాలయం 2015లో ఓ సర్వే నిర్వహించింది. వర్సిటీలో చదువుతున్న 26 మంది మెడికల్ విద్యార్థులను పరిశీలించింది. అప్పుడు వీరంతా కనీసం సగటున 23 సార్లు ముఖాన్ని, ముఖ భాగాలను తాకారని తేలింది. ప్రతి గంటలో ముక్కు, కంటి భాగాలను మూడుసార్లు చొప్పున.. నుదురు, బుగ్గలు, గడ్డం, పెదవులను నాలుగుసార్లు తాకుతారని... చెవిని గంటకు ఒకసారి మాత్రమే టచ్ చేస్తారని ఈ సర్వేలో వెల్లడయింది. ఆఫీసుల్లో పనిచేసిన వారిపై నిర్వహించిన మరో సర్వేలో ఆఫీసు వేళల్లో కనీసం సగటున 16 సార్లు ముఖాన్ని తాకుతారని తేలింది. ఈ మఖభాగాల ద్వారానే కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశమున్న నేపథ్యంలో వీలున్నప్పుడల్లా లేదంటే కనీసం ప్రతి 20 నిమిషాలకోసారి చేతులు శుభ్రంగా కడుక్కుంటే మంచిదన్నమాట. అందుబాటులో ఉంటే సబ్బు లేదంటే శానిటైజర్ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని ఈ సర్వేల ద్వారా అర్థమవుతోంది. అందుకే... మన వ్యక్తిగత పరిశుభ్రతే... ఈ పరిస్థితుల్లో మనకు శ్రీరామరక్ష. -
ఇల్లు కంటే.. జైలే పదిలం!
సాక్షి, హైదరాబాద్: ఇల్లు కంటే జైలే పదిలం. తెలంగాణ జైళ్లశాఖ అధికారులు, ఖైదీల కుటుంబ సభ్యుల మనోగతమిది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో జైలులో కొత్తవారు ఎవరూ లోనికి రాకపోవడం, బయటి వారెవరూ లోపలికి వెళ్లకపోవడం వంటి అంశాలు జైల్లోని ఖైదీలకు సానుకూల అంశాలేనని పోలీసులు ఉన్నతాధికారులు భావి స్తున్నారు. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యంపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే అన్ని రకాల ములాఖత్‌లు రద్దు చేశారు. ఒకరకమైన ప్రత్యేక కవచంలో ఖైదీలంతా భద్రంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జైలు ఇల్లులా మారింది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. ఇంటి కంటే కూడా జైలే భద్రమన్న భావన ఇటు జైలు అధికారుల్లోనూ, అటు ఖైదీల్లోనూ నెలకొంది. దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించి జన సంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రజా, ప్రైవేటు రవాణా నిలిపివేయడంతో జనజీవనం స్తంభించింది. రద్దీగా ఉండే జైళ్లలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో హోంమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, జైళ్ల శాఖ డీజీ, అన్ని జైళ్ల సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉంటారు. నివేదికపై కసరత్తు.. ఈ నివేదికపై ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నా రు. ఉత్తర భారత్‌లో జైళ్లలో ఖైదీల సంఖ్య అధికం. అందుకే, అక్కడ రద్దీ ఆధారంగా కొందరికి పెరోల్ మంజూరు చేసే అవకాశాలు లేకపోలేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెరోల్‌పై విడుదల చేసే వారి జాబితాను దాదాపుగా సిద్ధం చేసింది. అందులో ఏడేళ్లలోపు శిక్ష పడినవారు, సత్ప్రవర్తన కలిగిన వారు ఉన్నారని సమాచారం. అయితే ఖైదీల్లో నూటికి 99% బీదవారే. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు. ఇపుడు వీరికి పెరో ల్ ఇచ్చినా.. ప్రజారవాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల ఖైదీలు వెళ్లడం ప్రశ్నార్థకంగా మారుతుం దని, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీరు జైల్లో ఉండటమే మంచిదని పలువురు జైళ్లశాఖ సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికలో మన ఉన్నతస్థాయి కమిటీ ఏయే విషయాలు ప్రస్తావిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ప్రగతి మాట...పల్లెబాట
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం–పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పల్లె ప్రగతి రెండో విడతలోనూ దీనికే పెద్దపీట వేస్తోంది. సెప్టెంబర్‌లో 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పల్లెసీమలను ప్రగతిబాట పట్టించాలని భావిస్తోంది. ఈనెల 2నుంచి 12వ తేదీవరకు రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరుగనుంది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచే లా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. తొలి రోజు గ్రామ సభ నిర్వహించి.. మొదటి విడతలో చేపట్టిన పనులు, చేసిన చెల్లింపు వివరాలను ప్రజల ముందుంచనుంది. అలాగే సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, దాతల విరాళాల సమాచారాన్ని గ్రామస్తులకు చదివి వినిపించనుంది. 11 రోజులు పారిశుద్ధ్యం.. పల్లెప్రగతిలో భాగంగా 11 రోజులు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాలు, పిచ్చిచెట్లను తొలగించాలని నిర్దేశించింది. పాఠశాలలు, సంతలు, రోడ్లను క్లీన్‌గా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించింది. పచ్చదనం పెంపొందించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శాశ్వత నర్సరీని ఏర్పాటు చేయాలని, అటవీశాఖ అధికారుల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలని ఆదేశించింది. గ్రామ బడ్జెట్లో పదిశాతం విధిగా పచ్చదనం పెంచడానికి కేటాయించాలని స్పష్టం చేసింది. పల్లెప్రగతిలో భాగంగా పవర్వీక్ను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిపోయిన విద్యుత్ పనులు పూర్తి చేయాలని, వేలాడుతున్న, వదులుగా ఉన్న కరెంటు తీగలు, స్తంభాలను సవరించాలని సూచించింది. గ్రామాల్లో తప్పనిసరిగా ఎల్ఈడీ బల్బులు వినియోగించేలా చూడాలని పేర్కొంది. వార్షిక ప్రణాళిక తప్పనిసరి 2021 వార్షిక ప్రణాళిక రూపొందించి.. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని నిర్దేశించింది. అప్పులు, వేతనాలు, కరెంట్‌బిల్లుల చెల్లింపులను మదింపు చేయాలని, ఆస్తిపన్ను వసూలు, పన్ను పరిధిలోకి రాని ఇళ్లను గుర్తించడం, మొక్కలు నాటడం, స్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. నిధుల సమీకరణకు ప్రభుత్వ కేటాయింపులేగాకుండా.. సీఎస్ఆర్ నిధి, దాతల నుంచి విరాళాలు సేకరించాలని సూచించింది. ప్రతి పల్లెకు ప్రత్యేకాధికారి పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకు ప్రతి పంచాయతీకి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. వీరికి అదనంగా జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి. కాగా, ఈ సారి అఖిల భారత సర్వీసుల అధికారుల (ఏఐఎస్) సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ప్రత్యేక అధికారులు (ఫ్లయింగ్ స్క్వాడ్)గా నియమించింది. 12 మండలాలకు ఒక అధికారిని నియమిస్తున్న ప్రభుత్వం.. సగటున రెండు పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించేలా రూట్‌మ్యాప్ తయారు చేసింది. ఏయే మండలాలను కేటాయించారనే సమాచారాన్ని చివరి నిమిషంలో తెలియజేయనుంది. ఈ అధికారులు విధిగా పంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. అక్కడ జరుగుతున్న కార్యక్రమం తీరు, వైకుంఠధామం, శాశ్వత నర్సరీ, డంపింగ్ యార్డుల నిర్మాణం, నిర్వహణ ఇతర పనులను ప్రత్యక్షంగా పరిశీలించాల్సి వుంటుంది. అలాగే, తొలిదశలో గుర్తించిన పనులు, పనుల పురోగతి, ప్రస్తుతం చేపట్టిన పనులు, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, వార్షిక ప్రణాళిక అమలులో స్థానిక పాలకవర్గం పనితీరును మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో అలసత్వం వహించినట్టు తేలితే బాధ్యులైన అధికారులు, సర్పంచ్‌లపై చర్యలకు సిఫారసు చేసే అధికారాన్ని ఈ ప్రత్యేక బృందాలకు కట్టబెడుతోంది. -
శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మేని పరిశుభ్రత చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. నిజానికి ఆహారం కంటే ముందుగా దానికే ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా... సూక్ష్మజీవులకూ, రోగకారక క్రిములకూ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతిని, రోగాలను ఆహ్వానించినట్లవుతుంది. అందుకే వ్యక్తిగత శుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం చాలా ముఖ్యం. చాలామంది పొద్దున్నే ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం మాత్రమే వ్యక్తిగత శుభ్రత అనుకుంటారు. కానీ పర్సనల్ హైజీన్ పరిధి అంతకంటే కూడా ఎక్కువే. జుట్టు చివరి నుంచి పాదం చివరి గోరువరకూ ప్రతి అవయవాన్నీ శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో అవగాహన కల్పించేందుకే ఈ కథనం. నోటి సంరక్షణ ఇలా ప్రతిరోజూ పొద్దున్నే మనం పళ్లను బ్రష్ చేసుకుంటాం. వాస్తవానికి ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్ చేసుకోవాల్సిందే. అయితే రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండే మనందరికీ అది అంతగా కుదిరే పని కాకపోవచ్చు. అందుకే తిన్న తర్వాత ప్రతిసారీ బ్రష్ చేసుకోలేకపోయినా... నోట్లోకి నీళ్లు తీసుకుని కనీసం రెండుమూడు సార్లు పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన నోటిలో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ప్రతిరోజూ ఎలాగూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. బ్రషింగ్ తర్వాత మన చిగుర్లపైన వేలిచివరి భాగాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్లుగానూ, మసాజ్ చేసుకుంటున్నట్లుగానూ రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. మార్కెట్లో దొరికే మౌత్‌వాష్‌లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. నోటి దుర్వాసన ఉంటే... కొందరిలో ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ వారు నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అలాంటివారు తరచూ మౌత్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం మంచిది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నేరుగా నోటి దుర్వాసనకు కారణం కావడంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ, శరీర ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. దుర్వాసనకు కారణమవుతాయి. అందుకే అలాంటి దురలవాట్లు మానేయాలి. ఇక ఉల్లి, వెల్లుల్లి తినగానే అందులోని సల్ఫర్ కారణంగా నోటి నుంచి కాసేపు దుర్వాసన వస్తుంటుంది కాబట్టి పగటి వేళల్లో ముఖ్యం పనిచేసే చోట్ల అవి ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మేలు. ఇక నోటి పూర్తి సంరక్షణ కోసం కనీసం ప్రతి ఆర్నెల్లకోసారి డెంటిస్ట్‌ను కలిసి స్కేలింగ్ చేయించుకోవాలి. చెవుల సంరక్షణ చాలా మంది చెవుల శుభ్రతను పట్టించుకోరు. స్నానం సమయంలోనూ, ముఖం కడుక్కునే సమయంలోనూ చెవుల మీద సబ్బు రాసుకొని శుభ్రపరచుకోరు. మనం ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా అని పిలుచుకునే బాహ్య చెవిని కూడా స్నానం సమయంలో శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అలాగే కాసిని నీళ్లతో చెవిలో కాస్తంత లోపలి వరకూ శుభ్రం చేసుకోవాలి. అయితే చెవుల్లోకి మరింత లోతువరకు నీళ్లు పోకుండా చూసుకోవాలి. చాలామంది ఏమీ తోచనప్పుడల్లా చెవుల్లోకి పిన్నీసులూ, అగ్గిపుల్లలూ... కాస్తంత పట్ణణవాసులైతే ఇయర్‌బడ్స్ వంటి వాటితో చెవిలోపల కెలుకుతూ గువిలి తీస్తుంటారు. మన చెవుల్లోని గులివి చెవికి రక్షణ కల్పించడం కోసమే నిత్యం స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి ఇయర్‌బడ్స్ లాంటివి వాడకూడదు. ఇక చెవిలోని గువిలిని శుభ్రం చేయడం కోసం పదునైన పిన్నులు, అగ్గిపుల్లల వంటివి వాడటం వల్ల చెవిలోపలి భాగం గాయపడవచ్చు లేదా గువిలి మరింత లోపలికి చేరవచ్చు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకుని, ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రపరుస్తారు. స్నానం చేయడం ఇలా... ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ ఆ స్నానం వల్ల మనం పూర్తిగా శుభ్రపడ్డామా అన్నది చూసుకోరు. ముఖ్యంగా పిల్లలు. ఉదాహరణకు పిల్లలే కాదు... చాలా మంది పెద్దలు కూడా తమ చెవుల వెనక భాగాలనూ, మెడ వెనకా, శరీరంలో చర్మం మడతపడే చోట్లనూ శుభ్రం చేసుకోరు. తలస్నానం చేయడమిలా: తలస్నానం అన్నది క్రమం తప్పని ఇంటర్వెల్స్‌లో చేయాలి. కొందరు తలస్నానం చేసే ముందు తలకు నూనె రాసుకుంటారు. కానీ అందరి తలలకూ నూనె అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మర్దన (మసాజ్) చేసుకోవాలి. (జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయకపోయినా పర్వాలేదు). ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. చలికాలం లాంటి రోజుల్లో కూడా ప్రతిరోజూ స్నానం చేయండి. వేసవిలో అయితే కనీసం ఉదయం, సాయంత్రం రెండుపూటలా స్నానం చేయడం మంచిది. రోజూ ముఖం కడుక్కోండి మన దేహంలో బట్టలు తొడగని భాగాలు... అంటే చేతులు, ముఖం వంటి ఆచ్ఛాదన ఉండని భాగాలు తక్షణం కాలుష్యానికి గురవుతాయి. ఆ భాగాల్లో వెంటనే చేరుతుంటుంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. కాబట్టి వీలైనప్పుడల్లా ముఖంతో పాటు బట్టల కవర్ చేయని చేతులు, అరికాళ్లు కడుక్కుంటూ ఉండటం మంచిది. దీనివల్ల ముఖంపైన బ్యాక్టీరియా చేరడం వల్ల వచ్చే మొటిమల వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ముఖం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మేనిని ఇలా శుభ్రం చేసుకోండి మన శరీరంపై చాలాచోట్ల చర్మం ముడుతలు పడి ఉంటుంది. ఉదాహరణకు మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వద్ద చర్మం ముడుతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్‌తో తుడుచుకోవాలి. ఇక బాహుమూలాల కింద కొందరు డియోడరెంట్స్, యాంటీ పెర్స్పిరెంట్స్ వంటి స్ప్రేలు వాడుతుంటారు. అవి వాడటం కొంతవరకు పరవాలేదు కానీ ఎక్కువగా వాడటం సరికాదు. ఇలాంటివి సరిపడనివారు వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. చాలామందిలో పొడి చర్మం ఒక సమస్యగా పరిణమిస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో వారి సమస్య రెట్టింపవుతుంది. ఇలాంటివారు మాయిష్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి.ఇక చలికాలంలోనైతే ఇది తప్పనిసరి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి చర్మంపై గీరుకుపోయినా, కాస్తంత ఒరుసుకుపోయినా వారి పైచర్మం దోక్కుపోయి కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్కు గురికావచ్చు. నఖారవిందాల కోసం గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, మకొద్దిపాటి గోరంచు ఉండేలా కట్ చేసుకోవాలి. గోరు మరీ ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు ఇలా కత్తిరించుకుంటూనే ఉండాలి. మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా నీళ్లవిరేచనాలు, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఎన్నోరకాల వ్యాధులను నివారించుకున్నట్లూ అవుతుంది. ఇదే సూచన పాదాల గోళ్లకు కూడా వర్తిస్తుంది. కొందరు గోళ్లను చిగుర్లలోపలికి కట్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో గోటి చివర ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ తర్వాత గోరు లోపలికి పెరుగుతూ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే కాలిగోర్లు కట్ చేసుకునే సమయంలో మరీ అంచుల చిగుర్లలోకి కట్ చేసుకోకూడదు. చేతులు శుభ్రం చేసుకోవడం ఇలా... మనం ఆహారం తీసుకునే ముందర క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే మూత్ర, మల విసర్జన తర్వాత వీలైతే సబ్బుతోనో, హ్యాండ్‌వాష్‌తోనో తప్పక శుభ్రం చేసుకోవాలి. దీనికి కారణం ఉంది. వాష్‌రూమ్ తలుపు తెరవడం కోసం ప్రతివారూ తప్పనిసరిగా ‘నాబ్’ను ముట్టుకుంటారు. వారి చేతులకు ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు అంటుకొని ఉంటే... వారు ముట్టుకున్న ప్రదేశాన్నే మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు అంటుకు పోయి వ్యాధులు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే వాష్‌రూమ్‌కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక హాస్పిటల్లో పనిచేసేవారు సైతం తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండటం అవసరం. వీలైతే ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్‌వాష్‌లు వాడటం కూడా చాలవరకు మంచిదే. పాదాల శుభ్రత... మన కాళ్లనూ, మోకాళ్లనూ, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోండి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడిఅయ్యేంతవరకూ తుడుచుకోండి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా మన కాలి బొటనవేలి (పెద్దనేలు) గోరును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మన పాదరక్షలు ధరించినప్పుడు అవి కాలికి సౌకర్యంగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. షూ ధరించేవారు పరిశుభ్రమైన సాక్స్‌ను మాత్రమే తొడుక్కోవాలి. మామూలు వారిలోకంటే పాద సంరక్షణ డయాబెటిస్ రోగుల్లో మరింత ఎక్కువ అవసరం. హైహీల్స్ కాకుండా తక్కువ హీల్ ఉన్న పాదరక్షణలే వేసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న విధంగా రోజూ దేహ పరిశుభ్రత పాటిస్తే మేనూ, మనసూ ఈ రెండూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా హాయిగానూ ఉంటామని గుర్తుంచుకోవాలి. డాక్టర్ శ్యామల అయ్యంగార్, సీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్ అండ్ డయాబెటాలసిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
శుభ్రతపై నిర్లక్ష్యమేల?
ధన్వాడ: వ్యక్తిగత పరిశుభ్రతను పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో వాస్ (వాటర్ శానిటేషన్ హైజిన్) పథకాన్ని ప్రవేశ పెట్టినా అది చాలా పాఠశాలలో అమలు కావడం లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని భావించిన ప్రభుత్వం పాఠశాలలో వాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే నిబంధనలున్నాయి. ఇందుకు అవసరమైన సబ్బులను ఆయా పాఠశాలల నిధుల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలలో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షకులు సైతం ఉదాసీనత చూపుతుండడంతో ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుల బాధ్యత.. ఉపాధ్యాయులకు ప్రతీ నెల నిర్వహిస్తున్న సముదాయ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చి వాస్ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలను అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు దీనిపై పూర్తి అవగహన కల్పించి వారు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారికి అందుబాటులో సబ్బులు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులు పేట్టలను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించాలి. భోజనం సమయంలో పరిశుభ్రతకు సబ్బులను ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకు రాజీవ్ విద్యా మిషన్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.15వేలు సమకూరుస్తుంది. నిరాశే మిగిలింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాస్ పథకం కొంతవరకైనా మార్పు తెస్తోందని ఆశించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగిలింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిందే మొదలు మధ్యాహ్న భోజనం చేసే వరకు మట్టితో సంబంధాలు ఉన్నా వాటినే వాడుతుంటారు. చాలా పాఠశాలలో బెంచీలు లేక నేలపైనే కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులు మల, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చాలా పాఠశాలల్లో నీటి కొరత కారణంగా వీటికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో హడావుడిగా చేతుల పరిశుభ్రతను పెద్దగా పట్టించుకోవడంలేదు. ధన్వాడ మండలంలో మొత్తం 48 పాఠశాలలు ఉండగా ఇందులో 6500 విద్యార్థులు చదువుకుంటున్నారు. అమలుపై దృష్టి సారిస్తాం ప్రభుత్వ పాఠశాలలో ‘వాస్’ పథకం అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. ప్రతి సమావేశంలో ఉపాధ్యాయులకు వాస్‌పై సూచనలు అందిస్తున్నాం – సంగీత, ఎంఈఓ, ధన్వాడ -
అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం గా ఇండోర్ గుర్తింపు తెచ్చుకుంది. 2018 సంవత్స రానికి గాను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచిందని గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశ వ్యాప్తంగా 4,200 నగరాల్లో చేపట్టిన సర్వేలో ఇండోర్ తర్వాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్ ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 430 నగరాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇండోర్‌కే మొదటి స్థానం దక్కిందన్నారు. అదేవిధంగా, పరిశుభ్రత పాటించే రాష్ట్రాల్లో జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. -
రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికుల రేటింగ్
న్యూఢిల్లీ: రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఓ ఒప్పందాన్ని రూపొందించింది. దీని ప్రకారం రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికులు రేటింగ్ ఇవ్వవచ్చు. ఈ రేటింగ్ ఆధారంగా కాంట్రాక్టర్లకు ఇచ్చే నెలవారీ ప్రోత్సాహకాల్లో 30 శాతం వెయిటేజ్ ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రైల్వేలో ప్రతి విభాగం కాంట్రాక్టర్లపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా వారికి జరిమానాలు, బోనస్‌లు అందిస్తామని వెల్లడించింది. రైల్వే సూపర్వైజర్ కాంట్రాక్టర్ల హాజరుపై నివేదించిన వివరాల ఆధారంగా 25 శాతం, పరిశుభ్రత ఆధారంగా 15 శాతం, రైల్వే అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా మరో 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. పరిశుభ్రతపై ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడం వల్ల వ్యవస్థలోని లోపాలను క్షేత్రస్థాయిలో గుర్తించే అవకాశం ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారాన్ని జీపీఎస్ ఆధారిత వ్యవస్థలో రికార్డు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌బోర్డు హౌస్ కీపింగ్ స్టాఫ్(ఓబీహెచ్ఎస్) 1,700కి పైగా రైళ్లలో క్లీనింగ్ సర్వీస్‌ను అందిస్తోంది. -
గంగదేవి పల్లి స్పూర్తితో
ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఊరూ శుభ్రంగా ఉంటుంది. ఈ సూత్రాన్నే ఆ గ్రామస్తులు పాటించారు. వారికి అధికారుల సాయం అందింది. ఊరూవాడా కదిలింది....ఆ పల్లె కళకళలాడింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్ గ్రామం ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామ మహిళలు.. ఇటీవల గంగదేవిపల్లి, హాజిపల్లి గ్రామాలను సందర్శించి వచ్చారు. తమ గ్రామం కూడా వాటిలాగే పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు. అనుకోవడమే ఆలశ్యం... శ్రమదానంతో ఊరంతా శుభ్రం చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టారు. గ్రామంలో బుధవారం 200 మంది మహిళలు శ్రమదానం చేశారు. వీధులు, రోడ్లను శుభ్రం చేశారు. వీరికి పురుషులు కూడా కలిశారు. ఎవరి ఇంటి ముందు రోడ్లను వారే నిత్యం శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రమదానానికి రాని వారికి జరిమానా వేశారు. ఇకమీదట ప్రతినెలా 14వ తేదీన ఊరంతా శ్రమదాన దినంగా పాటించాలని నిర్ణయించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేసిన ఈ గ్రామానికి ప్రభుత్వం కూడా చేయూత నిచ్చింది. మరుగుదొడ్లు మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఒకే సారి 170 మరుగుదొడ్ల నిర్మాణం మొదలైంది. వీటి నిర్మాణం కోసం మహిళా సంఘాలు సిమెంట్ ఇటుకలను గ్రామంలోనే తయారు చేస్తున్నారు. -
‘స్వచ్ఛ భారత్’కు సవరణ అవసరం
పరిశుభ్రత విషయంలో ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ప్రధాని నరేంద్ర మోదీ చేసింది సరైందే. అయితే బహిరంగ స్థలాల పరిశుభ్రతపై మాత్రమే దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదన్నది జాతి నేర్చుకోవాల్సిన పాఠం. అవలోకనం మన దేశం మాదిరే, థాయ్‌లాండ్‌లో అనేక కార్లలోని డాష్ బోర్డుల్లో, శుభం కలగడానికి అదృష్టదేవత చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటారు. అయితే థాయ్ కార్లలోని విగ్రహాలు భారత్‌లో లాగా కారు లోపలికి కాకుండా రోడ్డుకు అభిముఖంగా తమ ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ‘నేను సురక్షితంగా ఉం డేలా చూడు’ అనేలా మన ప్రవృత్తి ఉం టుంది. ‘ఎవరూ గాయపడకుండా ఉండేలా రోడ్డును గమనించు’ అన్నది థాయ్ ప్రజల వైఖరి. థాయ్‌లాండ్ పరిశుభ్రమైన దేశం. సాపేక్షంగా అది పేద దేశమే అయినప్పటికీ (నిజానికి భారత్‌లాగే పేద దేశం) వారి బహిరంగ స్థలాలు పరిశుభ్రంగా ఉంటాయి. నేడు వారి బహిరంగ మరుగు దొడ్లు దాదాపుగా మచ్చలేని విధంగా ఉండటమే కాదు.. యూరోపి యన్ దేశాల కంటే మంచిగా... ఒక్కోసారి వాటికంటే ఉత్తమంగా కూడా ఉంటాయి. బ్యాంకాక్‌లోని వీధులకు, ముంబై, ఢిల్లీ వీధు లకు, అలాగే ఢాకా, లాహోర్, కరాచీ నగరాల్లోని వీధులకు మధ్య కూడా ఏమాత్రం పోలిక ఉండదు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం (అంటే ఆర్థికవ్యవస్థ మాత్రమే కాదు.. ఇప్పటికీ ఆదిమ స్వభావంతో ఉంటున్న నాగరికత, సంస్కృతి కూడా ‘అభివృద్ధి’ చెందవలసి ఉంది). థాయ్‌లాండ్ అభివృద్ధి చెందిన దేశం. దీనికి వారు అనుసరిస్తున్న బౌద్ధ మతంలోని హీనయాన శాఖ కూడా ఒక కారణమని నేనంటాను. దీన్ని తెరవాద అని కూడా పిలుస్తారు. తెరవాద శాఖను పాటిస్తున్న శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, కాంబోడియా, బర్మా వగైరా దేశాలన్నీ ఒకరకమైన ఏకత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రయత్నమైన స్వచ్ఛ భారత్ కార్యక్రమం (క్లీన్ ఇండియా మిషన్) అనే అంశాన్నే నేను ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నాను. ఈ వారం ములాయం సింగ్ యాదవ్ కోడలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. స్వచ్ఛ భారత్‌పై మోదీ వైఖరిని మహాత్మాగాంధీతో ఆమె పోల్చి చూపారు. ఆమెతో నేను ఏకీభవిస్తాను. ప్రధాని ఒక గాంధియన్ తత్వాన్ని ఆచరిస్తున్నారని భావిస్తున్నాను. నిజానికి గాంధీజీ కూడా మోదీ ప్రయత్నాన్ని ఆమోదించేవారు. అయితే మోదీ మనస్సులో ఈ ఆలో చన కొత్తది కాదన్నది వాస్తవం. ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రభావశీల నేత ఎం.ఎస్ గోల్వాల్కర్ జీవిత చరిత్రను రచించిన సందర్భంలో మోదీ ఒక పిట్టకథని జోడించారు. ఒకసారి గురూజీ (గోల్వాల్కర్) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లా రు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఉదయం 4 గంటల 30 నిమి షాలకు చేరుకుంది. అక్కడ అది 45 నిమిషాలు ఆగింది. ఆ సమ యంలో స్వయంసేవకులు గురూజీ, రైలు లెట్రిన్‌ను ఉపయోగిం చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి సీనియర్ స్వయంసేవక్ అయిన బాపూరావ్ మోఘేతో మాట్లాడుతూ ఆ రోజు కార్యక్రమం ఏమిటని గురూజీ అడిగారు. కార్యక్రమ వివరాలను గమనించిన గురూజీ తర్వాత బాపూరావ్ని ఒక ప్రశ్న అడిగారు, రైలు టాయ్లెట్లలో ఒక చిన్న నోటీసున యినా మీరు గమనించారా? చూశానన్నారు బాపూరావు. గురూజీ అప్పుడన్నారు. ‘రైలు ఒక స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు లెట్రిన్‌ను ఉపయోగించవద్దని అక్కడ రాసి ఉంది. నేను ఈ నిబం దనను అన్ని వేళలా తప్పకుండా పాటిస్తాను’. ఈ పిట్టకథను ప్రస్తావించిన మోదీ దానికి మరో ప్రశ్నను జోడించారు. ‘ఎన్ని లక్షలమంది ప్రయాణికులు ఈ నోటీసును చూసి ఉంటారో కాస్త ఊహించండి. వాస్తవానికి వీరిలో ఎంతమంది దీన్ని పాటించి ఉంటారు’? స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మోదీ ఒక ప్రతిజ్ఞ రూపొందించారు. దాని ద్వారా ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘నేను ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తున్నాను. పరిశుభ్రతకు నేను కట్టు బడి ఉంటాను. దీనికోసం సమయాన్ని కేటాయిస్తాను. పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి నేను సంవత్సరా నికి 100 గంటలు కేటాయిస్తాను అంటే వారానికి రెండు గంటలన్న మాట. నేను చెత్త వేయను, ఇతరులను వేయనీయను. నేనూ, నా కుటుంబం, నా నివాస ప్రాంతం, నా గ్రామం, నా పనిస్థలం అన్ని చోట్లా పరిశుభ్రత కోసం ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను’’. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే పలు దేశాల్లో అక్కడి పౌరులు చెత్త పారవేసే చర్యలను చేపట్టకపోవడం, ఇతరులు చెత్త పోయడాన్ని అనుమతించకపోవడం వల్లే అది సాధ్యమైందని నా విశ్వాసం. ఈ దృఢవిశ్వాసంతోటే, గ్రామాల్లో, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమ సందేశాన్ని నేను ప్రచారం చేస్తాను. ఈ రోజు నేను స్వీకరిస్తున్న ఈ ప్రతిజ్ఞను స్వీకరించవలసిందిగా వందమంది వ్యక్తులను నేను ప్రోత్సహిస్తాను. పరిశుభ్రత కోసం తమ వంద గంటలను వారు కేటాయించేలా ప్రయత్నాలు చేపడతాను. ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమైన పని ఏమిటంటే, ఇతరులు కూడా ఈ ప్రతిజ్ఞను స్వీకరించేలా చేయడం, (మోదీ పలువురు సెలబ్రిటీలను ఇలా పురమాయించారు) అలాగే కొన్ని బహిరంగ స్థలాలను శుభ్రపర్చేందుకు సమయాన్ని కేటాయించేటట్లు చేయ డం. భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి చేయవలసిన అనేక పనుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పొందుపర్చింది. ఆ వివరాలు పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. మోదీ అవలంబించిన విధానం పట్ల నాకు కొంత భేదాభిప్రా యం ఉంది. ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ఆయన చేసింది సరైందే. అయితే తర్వాత బహిరంగ స్థలాలను పరిశుభ్రపర్చడంపై దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. బహిరంగ స్థలాల్లో చీపుర్లు పట్టి ఫొటోలు తీయడం వెనుక, భారత్‌ను మురికి దేశంగా మారుస్తున్నది ఇతరులే అనే సందేశం వ్యక్తమవుతోంది. దీని నుంచే, ‘కాబట్టి బహిరంగ స్థలాలను పరిశు భ్రం చేయడంలో నేను సహాయం చేయాలి’ అనే భావనవస్తోంది. దీన్ని మనం మార్చాలి. ఈసారి విగ్రహం మనవైపే చూస్తుం డాలి కాని రోడ్డుకు అభిముఖంగా కాదు. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదు. ఇది జరిగినట్లయితే, మోదీ ప్రారంభించిన మంచి ప్రయత్నం మరింత ఉత్తమంగా విజయవంతమవుతుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్ -
క్లీన్లీనెస్‌పై బీజేపీకే చిత్తశుద్ధి లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్పై బీజేపీ నాయకులకే చిత్తశుద్ధిలేదని, అందుకే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం లేదని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ ఆరోపించారు. క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బీజేపీ నాయకులు ఫొటోల కోసం ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఫొటోల కోసం నాయకులు పోటీలు పడిన దృశ్యాలు కన్పించాయని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఇటీవల ఇస్లామిక్ సెంటర్ వద్ద ముందుగా వ్యర్థాలను వెదజల్లి మీడియా వచ్చిన తర్వాత శుభ్రం చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారని ఎద్దేవ చేశారు. సీనియర్ నాయకుడే ఇలా చేస్తే, ఈ కార్యక్రమాన్ని కిందిస్థాయి కార్యకర్తలు ఎట్లా విజయవంతం చేస్తారని ప్రశ్నించారు. పార్కులు పచ్చదనాన్ని కోల్పోతే ఆ బాధ్యత బీజేపీదేనని అన్నారు. క్లీన్‌నెస్ క్యాంపెయిన్‌ను ఆజామాషిగా నిర్వహించరాదని, నిత్యం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. -
అక్టోబర్ 2న నేనూ చీపురు పడతా: మోదీ
న్యూఢిల్లీ: పరిసరాల పరిశుభ్రత కోసం వారానికి కనీసం 2 గంటలైనా కేటాయించాలని ప్రధానమంత్రి మోదీ ప్రజలను కోరారు. క్లీన్ ఇండియా కార్యక్రమంలో రాజకీయ నాయకులు, మతపెద్దలు, మేయర్లు, సర్పంచ్‌లు, పారిశ్రామికవేత్తలు సహా అంతా పాల్గొనాలని, అక్టోబర్ 2న తాను కూడా ఒక చీపురు పట్టుకుని ఇందులో పాలుపంచుకుంటానని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటననలో తెలిపారు. పరిశుభ్రత గాంధీజీకి చాలా ఇష్టమైన అంశమని, ఆయన 150వ జయంతి (2019, అక్టోబర్ 2) నాటికి దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చి ఆయనకు ఘన నివాళులర్పిద్దామన్నారు. కాగా, ప్రభుత్వం చేపట్టిన క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైల్వే స్టేషన్లు, కార్యాలయాలను శుభ్రం చేసే కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు పాల్గొనాలని, తమ నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లో వారు ఆ కార్యక్రమం చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీలందరికీ లేఖలు రాశానన్నారు. రైల్వే ట్రాకులపై చెత్త వేసే వారిపై జరిమానా విధించాల్సిన అవసరం ఉందన్నారు. క్లీన్ ఇండియా లోగో ఆవిష్కరణ వచ్చే ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చేందుకు ఉద్దేశించిన ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ లోగోను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ‘స్వచ్ఛత వైపు ఒక అడుగు’ అనే ట్యాగ్‌లైన్‌తో మహాత్మాగాంధీ కళ్లజోడును లోగోగా రూపొందించారు. క్లీన్ ఇండియా కోసం దాదాపు రూ. 2లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందని, అందులో పట్టణాల్లో ఈ కార్యక్రమం అమలు కోసం పట్టణాభివృద్ధి శాఖ రూ. 62 వేల కోట్లను కేటాయించనుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు. -
నేనూ చీపురు పడతా: ప్రధాని మోదీ
బెంగళూరు: ప్రపంచ దేశాల ముందు గర్వంగా తల ఎత్తుకు తిరగాలంటే దేశంలో పరిశుభ్రతను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి స్వచ్ఛ భారత్‌ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వచ్చిన ఆయన బీజేపీ కార్యకర్తల బహిరంగ సభలో ప్రసంగించారు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు వారానికి రెండు గంటల చొప్పున కేటాయించాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున(అక్టోబర్ 2) తాను కూడా చీపురు పట్టుకుని వ్యర్థాలను ఊడ్చి పారేస్తానన్నారు -
దేవుడికి దగ్గరవడం ఎలా?!
దైవికం క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్టు గాడ్లీనెస్. పరిశుభ్రత అనేది దాదాపుగా దైవత్వమేనట! అంటే నిర్మాలిన్యం మనిషిని దేవుడికి చేరువ చేస్తుందని అర్థం. ఎవరన్నారు ఈ మాట? మదర్ థెరిస్సానా? అనే ఉంటారు. రోగులను ఆమె శుభ్రం చేశారు. రోగగ్రస్థ హృదయాలను శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. పరిశుద్ధ గ్రంథాలలో కూడా ఈ మాట ఉండే ఉంటుంది. సరిగ్గా ఇవే మాటలతో కాకున్నా, ఇదే అర్థం వచ్చేలా. జాన్ వెస్లీ అనే మత బోధకుడు తొలిసారి 1778లో ఒకానొక తన ప్రసంగంలో ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్’ అన్నట్లు అక్కడక్కడ రిఫరెన్సులు ఉన్నాయి. అలాగే ఈ మాట అతి ప్రాచీనమైన బాబిలోనియా, హీబ్రూ మత సంప్రదాయాలలోనిదని సూచించే ఉటంకింపులూ కనిపిస్తుంటాయి. నిజానికి ఈ మాట పుట్టవలసింది ఇప్పుడు! చెత్తను చుట్టూ కొండలా పేర్చుకుని మనిషి ‘హాయిగా’ జీవిస్తున్న ఈ ఆధునిక కాలానికి చెందవలసిన సామెత ఇది. చేతులకో, చెవులకో, కళ్లకో కాస్తయినా చెత్త అంటుకోనిదే మనిషిని మనిషిగా పోల్చుకోలేనంతగా రోజులు చెత్త దిబ్బలై కదిలిపోతున్నాయి. చుట్టూ సెల్ఫోన్లు.. మధ్యలో మనిషి! చుట్టూ టీవీ ఛానళ్లు.. మధ్యలో మనిషి. చుట్టూ యాప్‌లు, ఆన్లైన్ షాపులు, ఈఎమ్మయ్ సదుపాయాలు... వీటన్నిటి మధ్యా మనిషి! వస్తు వ్యామోహం ఇంటిని, ఒంటినీ చెత్తతో నింపేస్తోంది. ఇక దేవుడికి చోటెక్కడ? మనతో పాటు వచ్చి టీవీ ముందు కూర్చుంటానంటేనే భగవంతుడికైనా ఇంత ప్లేస్ దొరుకుతుందేమో! దేవుణ్ణి కూడా కలుపుకుపోయేంత ఉదారత్వాన్ని మనలో కలిగించే ప్రోగ్రామ్‌లే అన్నీ! అసుర సంధ్య వేళ దాటాక మొదలయ్యే దయ్యపు సీరియళ్లు, క్రైమ్ కహానీలైతే మన బుర్రకు కావలసినంత చెత్త. దేవుడు వచ్చిందీ, పోయిందీ కూడా తెలియనంత ఎంటర్టైన్మెంట్! మనిషి కారణంగా భూమి నిండా ఇంత చెత్త పేరుకుపోతుందని ఏ యుగంలోని దైవమూ ఊహించి ఉండకపోవచ్చు. మనిషిని నడిపిస్తున్నది ఇప్పుడు ప్రాణం కాదు, పరిసరాల్లోని చిందరవందర! బట్టలతో, అవి పాతబడిపోకుండానే వచ్చి చేరే కొత్త బట్టలతో, బజార్ నుంచి కట్టుకొచ్చిన పాలిథీన్ కవర్లతో, ఎలక్ట్రానిక్ భూతాలను ఇంటికి చేర్చిన కార్టన్ బాక్సులతో సహజీవనం చేస్తుంటే తప్ప ఊపిరి ఆడని స్థితిలోకి మనిషి వెళ్లిపోయాడు. షెల్ఫులో చిన్న కాగితం ముక్క లాగితే మొత్తం అక్కడున్న వస్తువులన్నీ పడిపోవాలి. వంటింట్లో చక్కెర డబ్బా మూత తెరుస్తుంటే, మోచేయి తగిలి మిక్సీ పైకప్పు ఎగిరిపడి వంటింట్లో అడుగుతీసి అడుగు వేసే దారే లేకుండా పోవాలి. అటకల మీద ఎన్నటికీ అవసరం పడని అమూల్యమైన మూటలుండాలి. స్టోర్ రూమ్ తలుపులను తోసుకుని విరిగిన కుర్చీలు, దూది రేగుతుండే పరుపులు వచ్చిపడుతుండాలి. అప్పుడే జీవితం నిండుగా ఉన్నట్లు! పందొమ్మిదో శతాబ్దపు అమెరికన్ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ఇలా అంటారు. దేవునికి ధన్యవాదాలు. మనిషికి గనుక రెక్కలు ఉండి ఉంటే ఈ భూమిని చెత్తతో నింపిన విధంగా, ఆకాశంలోనూ తన అమూల్యమైన చెత్తను పోగేసుకునేవాడు-అని. మనిషి పైన, మనిషి కింద, మనిషి పక్కన ఉన్న చెత్త గురించి మాత్రమే థోరో మాట్లాడారు. మనిషి లోపల ఉండే చెత్త గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించినట్లు లేకున్నా, ఫిలాసఫర్ కాబట్టి తప్పకుండా ఆలోచించే ఉంటారు. మనిషి లోపలి చెత్త.. మనిషి చుట్టుపక్కల చెత్త కన్నా దుర్గంధభూయిష్టమైనది. అసలు బయటి చెత్తకు.. లోపలి చెత్తే కదా మూల పదార్థం. లోపల, బయట ఇంత చెత్త ఉంటే దేవుడిని స్వచ్ఛమైన మనసుతో ఆరాధించడం అయ్యే పనేనా? ‘‘ఎక్కడ చెత్త ఉంటే అక్కడ శుభ్రం చేసే ప్రయత్నాన్ని ఇవాళే మొదలు పెట్టి చూడండి. మీరు శుభ్రం చేసిన చోటుకు మీ ప్రయత్నం లేకుండానే దివ్యత్వం వచ్చి చేరుతుంది’’ అంటారు జాన్ వెస్లీ. ఇది బయటి చెత్తకు. మరి లోపలి చెత్త ఎలా పోవాలి? గాంధీజీని ఆదర్శంగా తీసుకోవచ్చు. ‘‘మురికి పాదాలతో నా మనసును తొక్కుకుంటూ వెళ్లే అవకాశాన్ని నేనెవరికీ ఇవ్వను’’ అన్నారాయన. చెత్త మాటలను వినకపోవడం కూడా దేవుడికి దగ్గరయ్యేందుకు ఒక మార్గమే. - మాధవ్ శింగరాజు -
మోడీ.. రోజుకు 18 గంటల పని!!
మౌనముని మన్మోహన్ సింగ్ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా సైలెంట్‌గానే ఉంటున్నారని, అస్సలు ఆయన పనిచేసినట్లే కనిపించడంలేదని ఇటీవలి కాలంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే.. మన ప్రధానమంత్రి పని మనకు కనిపించడంలేదు గానీ, పొరుగునున్న చైనాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన తెల్లవారుజామున 5.30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు.. అంటే దాదాపు 18 గంటల పాటు మోడీ పనిచేస్తున్నారని చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' పత్రిక తన కథనంలో పేర్కొంది. పరిశుభ్రత, సమయపాలన.. ఈ రెండింటికీ మోడీ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఫైళ్లలో ఏ ఒక్కటీ పెండింగు ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులకు స్పష్టం చేస్తోందని ఈ కథనంలో తెలిపారు. మంత్రులంతా తమ తమ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ... ఉన్నతాధికారులు సమయానికి వస్తున్నారో లేదో, కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేవో చూస్తున్నారని, ఏమాత్రం సరిలేకపోయినా ఊరుకోవట్లేదని ఆ కథనంలో పేర్కొన్నారు. పాత ప్రభుత్వం కాలం నుంచి పెండింగులో ఉన్న ఫైళ్లను కూడా చకచకా క్లియర్ చేసేస్తున్నారని, అధికారులంతా ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు వచ్చి, సాయంత్రం 6 గంటల వరకు కచ్చితంగా ఉండేలా చేస్తున్నారని వివరించారు. ఏవైనా పనులుంటే 6 గంటల తర్వాత కూడా పనిచేయిస్తున్నారు. శనివారాలు కూడా అందరూ పని చేస్తున్నారని, అధికారులు ఏమైనా పని మిగిలిపోతే ఇళ్లకు ఫైళ్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. తమ శాఖల కార్యాలయాల్లో ఎక్కడా దుమ్ము ఉండకుండా, పాత ఫర్నిచర్ మిగలకుండా, ఫైళ్లు డెస్కుల మీద ఉండకుండా, కిళ్లీ ఉమ్మేసిన మరకలు కనపడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఆయా శాఖల కార్యదర్శులకు అప్పగించారని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక 'పీపుల్స్ డైలీ'కి ఇంగ్లీషు వెర్షనే ఈ 'గ్లోబల్ టైమ్స్' పత్రిక. -
మోడీ.. క్లీన్ క్లీన్!
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ రాకతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రతను సంతరించుకోనున్నాయి. మోడీ ఆదేశాలతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న కేంద్ర హోంశాఖ, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖల కార్యాలయాలను శుభ్రంగా మార్చే కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ రెండు కీలక శాఖల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా చిందరవందరగా పడి ఉన్న వస్తువులను, అవసరం లేని ఫైళ్లను వదిలించుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని ఆదేశాల మేరకు... పని ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్ ఇటీవల చాలా ప్రభుత్వ విభాగాలకు లేఖ రాసినట్లు ఓ అధికారి వెల్లడించారు.