నేనూ చీపురు పడతా: ప్రధాని మోదీ | i am allso carry out the broom: Prime Minister modi | Sakshi
Sakshi News home page

నేనూ చీపురు పడతా: ప్రధాని మోదీ

Published Wed, Sep 24 2014 1:57 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

నేనూ చీపురు పడతా: ప్రధాని మోదీ - Sakshi

నేనూ చీపురు పడతా: ప్రధాని మోదీ

బెంగళూరు: ప్రపంచ దేశాల ముందు గర్వంగా తల ఎత్తుకు తిరగాలంటే దేశంలో పరిశుభ్రతను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి స్వచ్ఛ భారత్‌ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వచ్చిన ఆయన బీజేపీ కార్యకర్తల బహిరంగ సభలో ప్రసంగించారు.

దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు వారానికి రెండు గంటల చొప్పున కేటాయించాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున(అక్టోబర్ 2) తాను కూడా చీపురు పట్టుకుని వ్యర్థాలను ఊడ్చి పారేస్తానన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement