న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ్‌భారత్‌పై బీజేపీ నాయకులకే చిత్తశుద్ధిలేదని, అందుకే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం లేదని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ ఆరోపించారు. క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బీజేపీ నాయకులు ఫొటోల కోసం ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఫొటోల కోసం నాయకులు పోటీలు పడిన దృశ్యాలు కన్పించాయని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఇటీవల ఇస్లామిక్ సెంటర్ వద్ద ముందుగా వ్యర్థాలను వెదజల్లి మీడియా వచ్చిన తర్వాత శుభ్రం చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారని ఎద్దేవ చేశారు. సీనియర్ నాయకుడే ఇలా చేస్తే, ఈ కార్యక్రమాన్ని కిందిస్థాయి కార్యకర్తలు ఎట్లా విజయవంతం చేస్తారని ప్రశ్నించారు. పార్కులు పచ్చదనాన్ని కోల్పోతే ఆ బాధ్యత బీజేపీదేనని అన్నారు. క్లీన్‌నెస్ క్యాంపెయిన్‌ను ఆజామాషిగా నిర్వహించరాదని, నిత్యం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు.
క్లీన్లీనెస్‌పై బీజేపీకే చిత్తశుద్ధి లేదు
Published Thu, Nov 6 2014 10:46 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement