'తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా' | Sonia Gandhi give Telangana, says Balram Naik | Sakshi
Sakshi News home page

'తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా'

Published Mon, Feb 24 2014 4:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

'తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా' - Sakshi

'తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా'

వరంగల్: తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా గాంధీ అని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో బలరాం నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ విజయోత్సవాలు జరపమనడం సిగ్గుమాలిన చర్య అని ఘాటుగా విమర్శించారు. 

రాజకీయ పునరావాసం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంటున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్లో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement