సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మండలాలు అమ్ముకొని పూట గడపుతున్న కేటీఆర్‌కు తనను తప్పు పట్టే అర్హత లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కేవలం 180 గ్రామాలు మాత్రమే ఆంధ్రలో కలిశాయని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కూనవరం, వీఆర్ పురం, చింతూరు, భద్రాచలం రూరల్, అశ్వాపురం రూరల్ తదితర మండలాలను ఏపీలో కలిపారన్నారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టు, పోడు భూములు, దేవాలయ భూములు ఆంధ్రకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులా తనపై ఆరోపణలు చేసేది అంటూ బలరాం నాయర్ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment