కేసీఆర్‌తో ఒరిగేదేమీ లేదు: బలరామ్ నాయక్ | balaram naik takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తో ఒరిగేదేమీ లేదు: బలరామ్ నాయక్

Published Fri, May 2 2014 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కేసీఆర్‌తో ఒరిగేదేమీ లేదు: బలరామ్ నాయక్ - Sakshi

కేసీఆర్‌తో ఒరిగేదేమీ లేదు: బలరామ్ నాయక్

 కేంద్ర మంత్రి  పోరిక బలరామ్ నాయక్

 మణుగూరు, న్యూస్‌లైన్: కేసీఆర్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని కేంద్ర మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలన్నా, ఎస్సీలన్నా కేసీఆర్‌కు పడదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. దళిత మహిళను ముఖ్యమంత్రిగా చే స్తుందని పార్టీ నేత రాహుల్ ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. గిరిజనులను ముంచే పోలవరాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే నిరాహార దీక్ష చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఎన్నికల్లో తనకు సహకరించిన ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను గెలిస్తే.. నియోకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలు తప్పకుండా నెరవేరుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, కుడితిపూడి కోటేశ్వరరావు, సోమరాజు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement