టార్గెట్ కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్‌గా ప్రసంగం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరిగిన తొలి ఎన్నికల ప్రచారసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన కేసీఆర్‌ను తూర్పార పట్టారు. కాంగ్రెస్ పార్టీతోపాటు తెలంగాణలోని నాలుగున్న కోట్ల మందిని మోసం చేశారని ఆయన ఆరోపించా రు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైనా మత విద్వేషాలను రెచ్చగొడ్తున్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం సాయంత్రం డిచ్ పల్లి మండలం సాంపల్లి శివారులో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారసభకు చేరుకున్న రాహుల్‌గాంధీ ఆద్యంతం మహిళలు, యువకులు, బడుగు, బలహీన, పేదవర్గాలను ఆకట్టుకునే ప్రసంగం చేశారు.రాహుల్‌గాంధీ ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సభ నిర్వహణ, సభా ఏర్పాట్లపై సంతృప్తి చెందిన రాహుల్‌గాం ధీ హెలిప్యాడ్ వద్ద పీసీసీ మా జీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను ప్రశంసించారు.
కలిసి ఉంటానని
తెలంగాణ ప్రకటన తర్వాత తన ఇంటికి వచ్చిన కేసీఆర్ తమతో ఉంటానని చెప్పి, ఆ తర్వాత వెన్నుపోటు పొడిచారని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఇటు కాంగ్రెస్‌ను అటు నాలుగున్నర కోట్ల మంది ప్రజలను మోసం చేశారన్నప్పుడు సభకు హాజరైన జనం చప్పట్లు కొట్టారు. దళితున్ని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కూడా మాట దాటవేశారని, రాజకీయ నాయకులు విలువలు, విశ్వసనీయత పాటించకపోతే ఎంతోకాలం మనలేరని రాహుల్ వ్యాఖ్యానించారు. మాట ఇస్తే నెరవేర్చడం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్దమైనప్పుడే నిజమైన నేతగా ప్రజలు విశ్వసిస్తారన్నారు. రాహుల్ తన ప్రసంగంలో కేసీఆర్‌పై విమర్శలు చేసినప్పుడు సభలో చప్ప ట్లు మ్రోగాయి.
ఎంతో శ్రమించాం
సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని రాహుల్‌గాంధీ అన్నారు. 2009లో ఓసారి ప్రయత్నం జరిగితే పలువురు ఆటంకం కల్పించారని, తెలంగాణ ఏర్పాటుకు తాము ఎంతో శ్రమించామని, సోని యాగాంధీ, కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చే ది కాదని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ఏర్పా టు కోసం ప్రజలు అనేక పోరాటా లు చేశారని, పోరాటాలు, ప్రాణత్యాగాలను తట్టుకోలేక అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలున్న ప్రాంతంలో నష్టం జరుగుతుందని తెలి సినా, ఇచ్చిన మాట కోసం ‘తెలంగాణ’ ఇచ్చామన్నారు. ప్రజల ఆత్మఘోష, బాధలు అర్థం చేసుకుని,దేశంలోని అన్ని పార్టీలను ఏకాభిప్రాయం చేసి ప్రజాస్వామ్య పద్ధ తిలో రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టామని రాహుల్‌గాంధీ మాట్లాడినప్పుడు జనం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ‘తెలంగాణ’ను సొమ్ము చేసుకో వాల ని చూస్తున్న బీజే పీ కూడ రాజ్యసభలో బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిందని అన్నారు.
అగ్రగామిగా నిలుపుతాం
జిల్లాలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించడంతో పాటు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన రాహుల్ ప్రధానంగా మహిళలు, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచ దేశా ల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలి పేందుకు కృషి చేస్తామని, తెలంగాణలో వస్తువులు తయారై అమెరికా, చైనాలాంటి దేశాలకు సరఫరా అయ్యేలా అభివృద్ధి చేస్తామని యువతకు భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం టీ ఫర్టులు, కెమెరాలు, గడియారాలు, ఇతర వస్తువు లపై మేడిన్ ఇన్-చైనా అని ఉంటుందని, భవిష్యత్ తెలంగాణలో ప్రతి వస్తువుపై ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉండేలా యువత అన్ని రంగాల్లో రాణిం చేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు అసెంబ్లీ, విధానసభ, పార్లమెంట్లలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రెండు వేల పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తామని మహిళల భద్రతకు ఆయన భరోసా ఇచ్చారు.
ఘన స్వాగతం
రాహుల్‌గాంధీకీ టీ-కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల రాహుల్‌తో పాటు హెలికాప్టర్‌లో రాగా, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ (డీఎస్), మాజీ మంత్రులు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, తాటిపర్తి జీవన్‌రెడ్డి, సురేష్‌కుమార్ షె ట్కార్, మధుయాష్కీ గౌడ్, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను రాహు ల్‌గాంధీ ప్రజలకు పరిచయం చేశారు. సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుం తియా తదితరులు పాల్గొన్నారు.