
రెండు రాష్ట్రాల్లోను ఎన్నికలు : బలరాం నాయక్
సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ శనివారం ఉదయం తిరుమలలో తెలిపారు. శ్రీధర్బాబు రాజీనామా చేయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు. అంతకుమందు ఆయన తిరుమలలో శ్రీవారిని విఐపీ ప్రారంభ దర్శన సమయంలో పాల్లొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో నాయక్కు వేదపండితుల ఆశ్వీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.