Kakatiya celebration
-
వైభవంగా ముగిసిన కాకతీయ ఉత్సవాలు
కాకతీయుల స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కృషి చేద్దామని కేంద్ర సామాజిక, సాధికారత న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ అన్నారు. కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. గొలుసు కట్టు చెరువులతో సుభిక్షమైన పాలన కొనసాగించిన ఘన చరిత్ర కాకతీయులదన్నారు. వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. ప్రతి ఏటా కాకతీ య ఉత్సవాలు నిర్వహించేలా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రత్యేక నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడు తూ వివక్షతకు, అణిచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాటి కాలం నుంచి రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య... నేటి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరు ల చరిత్ర ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గత ఏడాది *64కోట్లు విడుదల చేయగా అందులో 44 కోట్లే ఖర్చయ్యాయని, ఈసారీ *100 కోట్లతో జాతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకున్న ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని.. అందుకు కాకతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ పరిపాలనకు ప్రతిరూపంగా కాకతీయలు నిలిచారని, వరంగల్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా ఉత్సవాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. సుమారు 60 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, ఇకనుంచి టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు. సోని యగాందీ, మన్మోహన్సింగ్ కృషితో 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడబోతోందని పేర్కొ న్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో నూతన అధ్యాయం మొదలైందని, ఇప్పటినుంచి ప్రతీ ఏడాది కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. భావితరాలకు సందేశాన్ని అందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలోనే బెస్ట్ హెరిటేజ్ సిటీగా వరంగల్‌కు గుర్తింపు వచ్చిందని వివరించారు. కాకతీయుల చరిత్రతో కూడిన వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిం చడానికి *వంద కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలరించిన ప్రదర్శనలు ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పద్మశ్రీ మాధవి ముగ్దల్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు రచయితల వ్యాసాలతో కూడిన 400ల పేజీల ‘కాకతీయ ఉత్సవాలు’ సంచికను, సీనియర్ జర్నలిస్టు గటి క విజయ్‌కుమార్ రూపొందించిన ‘మణి మా ణిక్యాలు’ సీడీని ఆవిష్కరించారు. కోటలో కిక్కిరిసిన జనం .. చారిత్రక ఖిలావరంగల్ మధ్యకోటలో మూడు రోజులుగా కొనసాగిన కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగా యి. ఆదివారం ముగింపు వేడుకలను ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ అంజనేయులు ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహిం చిందని చెప్పారు. కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వరంగల్ తహసీల్దార్ రవి, మిల్స్కాలని సీఐ జి.కృష్ణ, ఆర్ఐ నాగేంద్ర ప్రసాద్, ఏఈ దయాకర్, గైడ్స్ రవియాదవ్ తదితరులు హాజరయ్యారు. ముడో రోజు వేడుకలను తిలకించడానికి నగరంతోపాటు జిల్లా నలుమూల నుంచి ప్రజ లు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జియావుద్దీన్, తాడూరి రేణుక, పేరిణి సునీత ప్రకాశ్, కస్తూర్భా విద్యార్థినులు, కుప్పా పద్మజ, రుద్రవేను, కృష్ణ డాన్స్ కాలేజీ విద్యార్థినులు, కృష్ణదేవ్, ముగ్దు బృందాల ప్రదర్శనలు, సదాశివ్ మిమిక్రీ ఆకట్టుకున్నాయి. -
పైలాన్...
సాక్షి, హన్మకొండ : కమలంలా వికసించుకున్న రెండు హస్తాలు. దాని మధ్యలోంచి నిటారుగా నిల్చున్న కాకతీయుల కాలం నాటి స్తంభం. దానిపై రాజసం ఉట్టిపడేలా హంస. కాకతీయ ఉత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలో నిర్మిస్తున్న పైలాన్ డిజైన్ ఇది. పైలాన్ కింది భాగంలో స్వచ్ఛతకు గుర్తుగా కమలం ముద్ర... దానిపై కాకతీయల సాంకే తిక నైపుణ్యం, నిర్మాణ కౌశలానికి ప్రతిబింబించేలా కీర్తితోరణాల స్తంభం... దాని మీద కాకతీయ కళలు, సంస్కృతి చిహ్నాలు ముద్రిస్తూ... స్తంభం పైభాగంలో హంస నిల్చుని ఉండేలా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. రూ.6.5 లక్షల వ్యయంతో వడ్డేపల్లి చెరువు గట్టుపై ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ నెల 20వ తేదీ నాటికి పైలాన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానుంది. కాకతీయ ఉత్సవాల సందర్భంగా పైలాన్ నిర్మించాలని గతంలోనే నిర్ణయించినా... పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కాకతీయ ఫెస్టివల్ ముగింపు సమయంలో పైలాన్ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పైలాన్‌ను ఎక్కడ నిర్మించాలనే అంశంపై నగరంలో చాలా ప్రాంతాలను పరిశీలించారు. చివరకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్, వడ్డేపల్లి చెరువును ఎంపిక చేశారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వడ్డేపల్లి చెరువు కట్టపై బతుకమ్మ విగ్రహం పక్కన స్థలాన్ని పైలాన్ నిర్మాణానికి అనువైనదిగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా పైలాన్ నిర్మాణానికి సంబంధించి వందలాది డిజైన్లు వచ్చినా... చివరికి ఏడు డిజైన్లు ఉత్తమమైనవిగా నిర్ధారించారు. దానిలో చిలువేరు మనోహర్ డిజైన్ని అత్యుత్తమంగా ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు. -
నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
సాక్షి, హన్మకొండ : ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాలు పునః ప్రారంభం కానున్నా యి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు గణపురం మం డల కేంద్రంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు)లో ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఉత్సవాలకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటువరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ హాజరుకానున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఉత్సవాలు పునఃప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి స్థానిక కళాకారులకు పెద్దపీట కాకతీయ ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో స్థానికేతరులకే పెద్దపీట వేశారు. 2012 డిసెంబర్లో జరిగిన ప్రారంభోత్సవంలో రాధారాజారెడ్డి, ఎల్లా వెంకటేశ్వర్లు వంటి ప్రసిద్ధులు. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరోసారి జరిగిన ఉత్సవాల్లో పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనందశంకర్ వంటి స్థానికేతరులైన జాతీయ స్థాయి కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కిం ది. అరుుతే ఈ సారి గతానికి భిన్నంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిం చారు. బుక్క సాంబయ్య, ఆజ్మీర గోవింద్‌నాయక్, పోరిక శ్యాం, నారగోని విశ్వనాథం, వెంకట్రాం నాయక్, గడ్డం సారయ్య వంటి జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారులు తమ బృందాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల వేడుకల్లో జిల్లాకు చెందిన 300 మంది కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు చుక్కా సత్తయ్య బృందం.. శివసత్తుల ప్రదర్శన ఇవ్వనుంది. వీడని నిధుల గ్రహణం ఏప్రిల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. నాలుగు నెలల విరామం తర్వాత కాకతీయ ఉత్సవాలు పునఃప్రారంభమవుతున్నా... నిధులకు గ్రహణం వీడలేదు.కాకతీయ ఫెస్టివల్ నిర్వహణకు నిధుల కేటాయిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో 2012 డిసెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ప్రతి నెలా ఉత్సవాల నిర్వహణ కష్టంగా మారింది. చివరకు కాకతీయ ఫెస్టివల్లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు పారితోషికం చెల్లించలేని స్థితి ఏర్పడింది. ఫలితంగా మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని వాయిదా పడగా.. మరి కొన్ని రద్దయ్యూరుు. ప్రస్తుతం రూ. 30 లక్షలు విడుదలైనప్పటికీ ఇందులో సగానికి పైగా నిధులు కళాకారుల పారితోషికాలకే సరిపోతాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో డిసెంబర్ వరకు నిరాటంకంగా ఉత్సవాల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారే అవకాశం ఉంది. కార్యక్రమ విశేషాలు కుప్ప పద్మజా బృందంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. డి ప్రవళిక, ఆర్.నిమిష, ఎల్.హర్షిణి, బి.శ్వేత, కె.కల్యాణి, ఎ.అనుశ్రీ, పి.చైతన్య, కె.ప్రణవ, పి.సౌందర్య, జి.వర్షిక, సహ్యూలతో కూడిన బృందంతో 45 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ బృందంలోని సభ్యులందరూ వరంగల్ జిల్లాకు చెందిన వారే. కన్నా సాంబయ్య బృందం వీర బ్రహ్మేంద్రస్వామి జననం బుర్రకథ ఉంటుంది. కన్నా సాంబయ్యతోపాటు ఎం.సదానందం, ఆర్.అశోక్ ఉన్నారు. ఈ కళారూపం గంటపాటు ఉంటుంది. కోటగుళ్లలో ఏర్పాట్లు పూర్తి గణపురం : కాకతీయ ఉత్సవాల నిర్వహణకు గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు ముస్తాబయ్యూరుు. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఉత్సవాలకు ఇన్చార్జ్గా ఉన్న ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ రెండు పర్యాయాలు గణపేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతిఒక్కరికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమాలు నిర్వహించే వేదికతోపాటు సౌండ్స్, లైటింగ్, తాగునీటి వసతి, ఉత్సవాలకు వచ్చే కళాకారులు, అతిథులకు చేసే ఏర్పాటపై సోమవారం సాయంత్రం ఎంపీడీఓ గుళ్లపల్లి విద్యాసాగర్, తహసీల్దార్ రజితతో ఐటీడీఏ పీఓ మాట్లాడారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యూయని అహ్మద్‌కు వారు తెలిపారు. కాగా, మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో దేవాలయ ప్రాంగణంలో అక్కడక్కడ నీరు నిలిచింది. దీంతో తహసీల్దార్ రజిత పర్యవేక్షణలో సిబ్బంది 150 ట్రాక్టర్ల మొరం తెప్పించి బురద గుంటలను పూడ్చారు.మట్టి కోట చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు మూడు రోజులుగా 300 మంది కూలీలతో పనులు చేయించారు. ఇదిలా ఉండగా, విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో అధికారులు రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా మూడు జెనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకుల కోసం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో 10 మరుగుదొడ్లను నిర్మించారు. కేటీపీపీ అధికారులు మూడు రోజులపాటు ప్రతి రోజు 20 వేల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. -
24 నుంచి కాకతీయ ఉత్సవాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాలు తిరిగి ఈ నెల 24నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయులపై సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం వరంగల్ మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.వెంకటరమణ, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావుతో కలెక్టర్ సమావేశమయ్యారు. 24, 25, 26 తేదీల్లో ఘణపురం ఉత్సవాలను ములుగుఘణపురం కోటగూళ్ల దగ్గర నిర్వహించనున్నట్లు తెలిపారు. రాణిరుద్రమ దేవి సామ్రాజ్య అధినేతగా బాధ్యతలు చేపట్టి 750 సంవత్సరాలు పూర్తయినందున అక్టోబర్ 2న ఖిలా వరంగల్‌లో మహిళా సాధికారత అనే అంశంపై ఇంటాక్ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 5,6 తేదీలలో కాకతీయ యువ జనోత్సవాలను నిర్వహిస్తామని, ఈ యువజనోత్సవాల్లో భాగగా అన్ని కళాశాలల విద్యార్థులు భాగస్వామ్యం చేస్తామన్నారు. కాకతీయుల చరిత్ర, నీటి పారుదల వ్యవస్థ, నిర్మాణ శైలి ఇతర అంశాలపై కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్ఐటి, ఇంటాక్లతో సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. నవంబర్ 14న బాలల దినోత్సవాల సందర్బంగా కాకతీయ బాలల ఉత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.