Public welfare programs
-
సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
చెన్నై, సాక్షి ప్రతినిధి: గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగిస్తూ 2011 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకంజ వేయలేదని అన్నారు. ప్రభుత్వ బస్సు ల్లో సీనియర్ సిటిజన్లు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామని ఆనాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నామని తెలిపారు. 60 ఏళ్ల కు పైబడిన వ్యక్తులకు బస్సు డిపోల నుంచి పది టోకెన్లను పొందవచ్చని, ఈ టోకెన్లను కండక్టరుకు ఇచ్చి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. సీని యర్ సిటిజన్లు బస్సు డిపోల్లో దరఖాస్తులను భర్తీ చేసి ఫొటో గుర్తింపు కార్డు ను పొందాల్సి ఉంటుందని చెప్పారు. గుర్తింపు కార్డులను ఏఏ డిపోల్లో జారీ చేస్తారో వివరాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. గుర్తింపుకా ర్డు జారీకి తుది గడువు అంటూ ఏమీ విధించలేదని, అవసరమైన వారు ఎప్పుడైనా పొందవచ్చని ఆమె తెలి పారు. తొలిదశగా ఈ సౌకర్యాన్ని చెన్నైలో 24వ తేదీ నుంచి అమలుచేస్తున్నట్లు చెప్పారు. మంత్రుల వైఖరికి నిరసనగా వాకౌట్: అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లోని అంశాలపై డీఎండీకే ఎమ్మెల్యే చర్చ ను లేవనెత్తగా మంత్రులు పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, నత్తం విశ్వనాథన్, పళనియప్పన్, వేలుమణి, తొప్పు వెంకటాచలం వరుసగా అడ్డుతగిలారు. తమ పార్టీతో పొత్తు వల్ల ఎమ్మెల్యేలు అయిన మీరంతా అమ్మ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు కృతజ్ఞతలు చెప్పాలని వ్యాఖ్యానించారు. తాము కూటమిలో చేరకుంటే మీరు మంత్రులు అయ్యేవారు కాదంటూ వారి విమర్శలను చంద్రకుమార్ తిప్పికొట్టారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వేరుపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసీటు కూడా దక్కలేదని మంత్రులు మరోసారి ఎద్దేవా చేశారు. ఇరుపక్షాలు వాదులాడుకోగా డీఎండీకే ఎమ్మెల్యేల సంభాషణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే తమ మాటలు రికార్డుల నుంచి తొలగిస్తారా అంటూ చంద్రకుమార్ స్పీకర్‌ను నిలదీశారు. ఆధారం లేని ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తామని, తనను ప్రశ్నించే అధికారం మీకు లేదని స్పీకర్ పేర్కొన్నారు. డీఎండీకే ఎమ్మెల్యేలపై మంత్రులు, స్పీకర్ మూకుమ్మడిగా మాటల దాడికి దిగడంతో నిరసనగా వాకౌట్ చేశారు. డీఎండీకేతోపాటు డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. అధికారంలో ఉన్న అహంకారంతో మంత్రులు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని విపక్షాలకు చెందిన సభ్యులు ఆరోపించారు. మంత్రుల వైఖరితో విసిగిపోయినందునే అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసినట్లు డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయ ప్రాంగణంలో మీడియాకు తెలిపారు. బడ్జెట్లో పొందుపరిచిన పది అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రసంగించేందుకు తాను చేసిన ప్రయత్నాలను మంత్రులు అడ్డుకున్నారని చంద్రకుమార్ తెలిపారు. ఈ పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాల్లో కొనసాగలేక బైటకు వచ్చేశామని వివరించారు. -
చెరగని ముద్ర
నేడు మహానేత వైఎస్ఆర్ వర్ధంతి ♦ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ♦ పేదల గుండెల్లో సుస్థిరస్థానం ♦ {పతిష్టాత్మక పథకాలు ఇక్కడినుంచే ప్రారంభం సమసమాజ నిర్మాణమే ఆయన ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే ఆయన లక్ష్యం.. ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి పేదల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ మహానేత కురిపించిన వరాలు జిల్లా అభివృద్ధికి నాంది పలికాయి. ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ప్రాణం పోసింది. కుయ్..కుయ్ అంటూ పరుగులుతీసే 108అంబులెన్స్ మరెందరో అభాగ్యుల ప్రాణాలు కాపాడింది. పేదల సొంతింటి కలనెరవేరింది. జలయజ్ఞంతో కృష్ణాజలాలు కరువు నేలపై గలగల పారాయి.. మహబూబ్‌నగర్ అర్బన్ : పాలమూరు జిల్లాపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకమైన అభిమానం చూపారు. జిల్లానుంచే ప్రారంభించిన ఇంది రమ్మ ఇళ్లు, రూ.2కే కిలోబియ్యం, పేదలకు భూపంపిణీ పథకాలు ఎంతో లబ్ధిచేకూర్చాయి. అందుకే ఆయన పేదల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నా రు. సీఎం హోదాలో ఆయన అలంపూర్ ని యోజకవర్గంలో మూడుసార్లు పర్యటించి వరాలజల్లు కురిపించారు. మొదటిసారిగా ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని 2006లో అలంపూర్ పట్టణంలో ప్రారంభించారు. అలంపూర్- ర్యాలంపాడు గ్రామాల మధ్య తుంగభద్ర నదిపై రూ.35కోట్ల వ్యయంతో బ్రిడ్జిని మంజూరుచేసి శంకుస్థాపన చేశారు. అలాగే వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదుసార్లు పర్యటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా భూపంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడినుంచే ప్రారంభించారు. జలయజ్ఞ ప్రదాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రూ.1478కోట్లతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 25వేల ఎకరాల నుంచి రెండులక్షల ఎకరాలకు పెంచడంతో పాటు, అదేస్థాయిలో నిధులు విడుదల చేసిన వైఎస్ జలయజ్ఞ ప్రదాతగా వెలుగొందారు. ప్రతిపక్షనేత హోదాలో గద్వాల ప్రాంతంలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టుల పునాది రాళ్ల వద్ద మొక్కలు నాటి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత నగరబాటతో పట్టణాభివృద్ధికి ఇక్కడినుంచే శ్రీకారం చుట్టారు. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతరువాత సీఎం హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లాపూర్‌కు వచ్చారు. ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీరిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2007 జనవరి నెలలో మంచాలకట్ట వద్ద కృష్ణానదిలో పుట్టిమునిగి 61మంది మృతిచెందడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూ.110కోట్ల వ్యయంతో సోమశిల- సిద్ధేశ్వరం వంతెన, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.2కే బియ్యం పథకాన్ని జడ్చర్లలో ప్రారంభి పేదల అభిమానాన్ని చూరగొన్నారు. నియోజకవర్గ తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.55కోట్ల వ్యయంతో రామన్‌పాడు తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. పీయూ అభివృద్ధికి పునాది పాలమూరు యూనివర్శిటీ: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరుచేశారు. ఉస్మానియా పీజీ సెంటర్ స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శి టీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా పీయూ ప్రా రంభానికి శిలాఫలకం వేశారు. ఆ తర్వాత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియమించి త్వరగా అభివృద్ధి పనులు చేయాలని వీసీని ఆయన ప్రో త్సహించారు. మొదట ఐదుకోర్సులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 17కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. పీయూ లో అన్ని కోర్సుల్లో కలిపి 2500 మంది విద్యార్థులు చదువుతున్నారు. -
వంద రోజుల్లో ఒరిగిందేమీలేదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వందరోజుల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అట్టహాసంగా ప్రకటించిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించింది. ధర్నా సందర్భంగా ఉదయం 11 గంటలకు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమమిది. దీంతో డీసీసీ సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు సాగిన ధర్నాతో ఖైరతాబాద్- లక్డీకాపూల్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు కార్యకర్తలు కలెక్టరేట్‌వైపు దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా వ ూరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్రనేతలతోపాటు ఆందోళనకారులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అగ్ర నేతలు హాజరయ్యారు. అయితే మాజీ హోంమంత్రి సబితారెడ్డి హాజరుకాలేదు. ఇది ఆరంభం మాత్రమే: పొన్నాల టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ధర్నాలో పాల్గొన్న ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనలేదన్నారు. రుణమాఫీ, కరెంటు సమస్య, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం ఆయా కుటుంబాలను పరామర్శించలేని పరిస్థితిలో ఉందన్నారు. పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా విద్యుత్ అధికారులు స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో క్షణాల్లో ఈ సమస్య పరిష్కరించామని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, ఆర్నెళ్లలో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ధర్నాలో మాజీ మంత్రులు దానం నాగేందర్, జి.ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, కె.శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షులు జి.వెంకటస్వామి, డీసీసీ ఇన్చార్జ్ క్యామ మల్లేష్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ముగిసిన కాకతీయ ఉత్సవాలు
కాకతీయుల స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కృషి చేద్దామని కేంద్ర సామాజిక, సాధికారత న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ అన్నారు. కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. గొలుసు కట్టు చెరువులతో సుభిక్షమైన పాలన కొనసాగించిన ఘన చరిత్ర కాకతీయులదన్నారు. వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. ప్రతి ఏటా కాకతీ య ఉత్సవాలు నిర్వహించేలా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రత్యేక నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడు తూ వివక్షతకు, అణిచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాటి కాలం నుంచి రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య... నేటి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరు ల చరిత్ర ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గత ఏడాది *64కోట్లు విడుదల చేయగా అందులో 44 కోట్లే ఖర్చయ్యాయని, ఈసారీ *100 కోట్లతో జాతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకున్న ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని.. అందుకు కాకతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ పరిపాలనకు ప్రతిరూపంగా కాకతీయలు నిలిచారని, వరంగల్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా ఉత్సవాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. సుమారు 60 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, ఇకనుంచి టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు. సోని యగాందీ, మన్మోహన్సింగ్ కృషితో 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడబోతోందని పేర్కొ న్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో నూతన అధ్యాయం మొదలైందని, ఇప్పటినుంచి ప్రతీ ఏడాది కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. భావితరాలకు సందేశాన్ని అందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలోనే బెస్ట్ హెరిటేజ్ సిటీగా వరంగల్‌కు గుర్తింపు వచ్చిందని వివరించారు. కాకతీయుల చరిత్రతో కూడిన వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిం చడానికి *వంద కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలరించిన ప్రదర్శనలు ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పద్మశ్రీ మాధవి ముగ్దల్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు రచయితల వ్యాసాలతో కూడిన 400ల పేజీల ‘కాకతీయ ఉత్సవాలు’ సంచికను, సీనియర్ జర్నలిస్టు గటి క విజయ్‌కుమార్ రూపొందించిన ‘మణి మా ణిక్యాలు’ సీడీని ఆవిష్కరించారు. కోటలో కిక్కిరిసిన జనం .. చారిత్రక ఖిలావరంగల్ మధ్యకోటలో మూడు రోజులుగా కొనసాగిన కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగా యి. ఆదివారం ముగింపు వేడుకలను ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ అంజనేయులు ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహిం చిందని చెప్పారు. కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వరంగల్ తహసీల్దార్ రవి, మిల్స్కాలని సీఐ జి.కృష్ణ, ఆర్ఐ నాగేంద్ర ప్రసాద్, ఏఈ దయాకర్, గైడ్స్ రవియాదవ్ తదితరులు హాజరయ్యారు. ముడో రోజు వేడుకలను తిలకించడానికి నగరంతోపాటు జిల్లా నలుమూల నుంచి ప్రజ లు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జియావుద్దీన్, తాడూరి రేణుక, పేరిణి సునీత ప్రకాశ్, కస్తూర్భా విద్యార్థినులు, కుప్పా పద్మజ, రుద్రవేను, కృష్ణ డాన్స్ కాలేజీ విద్యార్థినులు, కృష్ణదేవ్, ముగ్దు బృందాల ప్రదర్శనలు, సదాశివ్ మిమిక్రీ ఆకట్టుకున్నాయి.