కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమైన ఓటరు నమోదు డిసెంబర్ 23తో ముగిసింది. ఈ ప్రక్రియ సుమారు 36 రోజులుపాటు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 2,16,276 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు 2,12,296 మంది యువత నుంచి దరఖాస్తులు అందాయి. సోమవారం తుదిరోజు కావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు చేసే ప్రక్రియ కూడా కొనసాగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్‌లో పొందుపర్చే ప్రక్రియ ప్రారంభించారు. కాగా, జిల్లా అధికారులు ఇప్పటివరకు 41,654 దరఖాస్తులు కంప్యూటర్‌లో డాటా ఎంట్రీ చేశారు. ఇంకా 1,32,073 దరఖాస్తులను డాటా ఎంట్రీ చేయాల్సి ఉంది.
ముగిసిన ఓటరు నమోదు
Published Tue, Dec 24 2013 4:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement