vote registration program
-
హోమ్ ఓటింగ్.. పోలింగ్ స్టేషన్..
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్‌స్టేషన్‌కు వచ్చిగానీ, ఇంటివద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సన్నద్ధత, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై సోమవారం సచివాలయం నుంచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్ ఆఫీసరుకు ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకసారి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేవారి కోసం వీడియో గ్రాఫర్‌తో, అయిదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవో ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. -
సర్వర్ డౌన్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు. ఐదేళ్ల పాలనపై తీర్పు చెప్పడానికి ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా.. నీ ఓటు ఉందా? పోయిందా? అనే ప్రశ్నతోనే పలకరింపులు మొదలవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓటు వేద్దామని ఉత్సాహంగా ఎదురు చూస్తే ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమైంది. ప్రతిపక్షానికి మద్దతుదార్లు, సానుభూతిపరులన్న అనుమానం ఉన్నవారి ఓట్లను తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఇంకెవరో మాయగాళ్లు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దీంతో ఎన్నికల సంఘం వేలాది ఓట్లపై వేటు వేసింది. విషయం తెలుసుకుని ఓటర్లు నిర్ఘాంతపోతున్నారు. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అందులో తమ పేరు కనిపించక లబోదిబోమంటున్నారు. మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుందామంటే సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల సంఘం సర్వర్ మొరాయిస్తుండడంతో ఆన్లైన్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య వేధిస్తోంది. మరోవైపు ఓట్ల నమోదు గడువు ఇక రెండు రోజులే మిగిలి ఉండడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారికీ దక్కని ఓటు హక్కు ఓటర్ల జాబితాను పరిశీలించడానికి, అందులో పేరు లేకపోతే మళ్లీ ఓటు హక్కు పొందడానికి చాలామంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఎన్నికల సంఘం సర్వర్ మొరాయిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఓటు ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కొత్త ఓటును నమోదు చేసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. ఉదయం నుంచి ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఓటు నమోదు చేసుకోలేకపోతున్నామని జనం వాపోతున్నారు. కొన్నిజిల్లాల్లో సైట్ ఓపెన్ అవుతోందని కానీ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారిగా సర్వర్ డౌన్ అవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 18 ఏళ్లు నిండినవారు దాదాపు 19 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో చాలామంది ఇంకా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నా సాంకేతిక సమస్యల వల్ల ఫలితం లేకుండాపోతోంది. ఓటు హక్కు పొందాలని ఆసక్తి చూపిస్తున్నా ఆన్లైన్లో సాంకేతిక అవరోధాలు ఎదురవుతుండడంతో జనం నిరాశకు గురవుతున్నారు. గడువు పెంచాలని విజ్ఞప్తులు ‘‘ఓటు ఉందో లేదో వెంటనే చూసుకోండి, కొత్తగా ఓటరు నమోదుకు మార్చి 15వ తేదీ వరకే గడువు ఉంది, ఈలోగా నమోదు చేసుకోకపోతే పోలింగ్ తేదీన వచ్చి ఓటు లేదంటే మేము ఏమీ చేయలేం’’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని ఓటర్లు చెబుతున్నారు. దీంతో చాలామంది ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసి చెప్పండంటూ నేరుగా పత్రికా కార్యాలయాలకే ఫోన్లు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సర్వర్ పనిచేయడం లేదని, తక్షణమే సర్వర్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఓటు నమోదుకు గడువును మరో రెండు రోజులు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం వీలుకాకపోతే, వెంటనే ఫారం–6 పూర్తి చేసి, సంబంధిత బూత్ లెవల్ అధికారికి(బీఎల్ఓ) గానీ, తమ కార్యాలయంలో గానీ అందజేయాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఓటు నమోదుకు తప్పని తిప్పలు విజయనగరం జిల్లాలో ఓటర్ నమోదుకు దరఖాస్తులు వెల్లువలా రావడంతో బుధవారం ఎన్నికల సంఘం వెబ్సైట్ చాలాసేపు స్తంభించిపోయింది. ఓటర్ నమోదుకు ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో ఇప్పటికే భారీ సంఖ్యలో ఓట్లను రద్దు చేశారు. ఓటరు నమోదుకు ఆన్లైన్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్ స్తంభించిపోతోందని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి చెప్పారు. ‘1950’కు ఫిర్యాదు చేసినా... శ్రీకాకుళం జిల్లాలో ఓటు నమోదుకు ఆన్లైన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సీఈఓ ఈ–రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి ఫారం–6 నింపి, అప్లోడ్ చేయడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. జిల్లాలోని పలువురు ప్రజలు బుధవారం ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆన్లైన్లో ఫారం–6 నింపుతుండగా, ఫోటో అప్లోడ్ చేస్తుండగా సమస్య తలెత్తుతోంది. దరఖాస్తు అసలు అప్లోడ్ కావడం లేదు. దీనిపై ‘1950’కు ఫిర్యాదు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. మీ–సేవా కేంద్రాల వద్ద జనం బారులు వైఎస్సార్ జిల్లాలో సర్వర్ పనిచేయక ఓటర్ల నమోదుకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల దరఖాస్తులు చేసేందుకు ఓటర్లు క్యూలైన్లలో ఓపికగా నిల్చుని, చివరకు చేసేది లేక వెనక్కి వచ్చారు. జిల్లా కేంద్రమైన కడపలో చాలామంది దరఖాస్తు చేసుకోవాలని వచ్చినా సర్వర్ పనిచేయకపోవడంతో వెనుతిరిగారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది దరఖాస్తు చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా మీ–సేవతోపాటు ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ కేంద్రాల్లో సర్వర్ సమస్యతో అవస్థలు పడ్డారు. ఫారం–6 ఎవరికి సమర్పించాలో.. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఈ–సేవ, ఇంటర్నెట్ కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. రాత్రి పది గంటల తర్వాత మాత్రమే సైట్ ఓపెన్ అవుతోంది. వివరాలు అప్లోడ్ అయ్యేలోగా కట్ అయిపోతోంది. మళ్లీ మొదటి నుంచీ చేసుకోలేక జనం మిన్నకుండి పోతున్నారు. ఇంకోవైపు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఫారం–6 దరఖాస్తులను సమర్పించాలో తెలియడం లేదని జనం అంటున్నారు. రెండురోజులుగా పెండింగ్‌లోనే దరఖాస్తులు కృష్ణా జిల్లాలో ఓటు హక్కు నమోదుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సర్వర్ రెండు రోజులుగా పనిచేయడం లేదు. జిల్లావ్యాప్తంగా రోజుకు 2000లకు పైగా ఫారం–6 దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. రెండు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో 4,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతో దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. చేతులెత్తేస్తున్న అధికారులు కర్నూలు జిల్లాలో ఓటర్లుగా నమోదు అయ్యేందుకు సర్వర్ చిక్కులు వచ్చాయి. దరఖాస్తులను అప్లోడ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. మంగళవారం సర్వర్ కొంత మెరుగ్గా ఉండగా బుధవారం మొండికేసింది. తమకు అసలు ఓటు హక్కు వస్తుందా రాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. సర్వర్ సమస్యను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా.. ఒత్తిడి పెరిగినందున పనిచేయడం లేదని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేదు ‘‘ఓటర్ల నమోదు ప్రక్రియకు గడువు దగ్గర పడుతోంది. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్లు పనిచేయక జనం ఇబ్బందులు పడుతున్నారు. మీ–సేవా కేంద్రాలకు వెళ్లి, చాలాసేపు నిరీక్షించినా ఓటుకు కోసం దరఖాస్తు చేసుకోలేక తిరిగి రావాల్సి వస్తోంది. ఈ సమస్య బుధవారం మరింత ఎక్కువగా ఉంది’’ – జి.ప్రదీప్‌కుమార్, రాజానగరం, తూర్పు గోదావరి జిల్లా -
మరో చాన్స్
సాక్షి, సంగారెడ్డి: అర్హులై ఉండి ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం ఈ నెల 2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు స్వీకరిస్తారు. గత నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ 2019లో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓటరు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరాలను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫాం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తి చేసి బీఎల్ఓలకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 6,7,8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచుతారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. జిల్లాలో 11,99,713 మంది ఓటర్లు.. గత నెల 22న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా మేరకు జిల్లాలో మొత్తం 11,99,713 మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తగా ఓటర్ల నమోదుతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత 55,953 మంది అదనంగా ఓటర్ల జాబితాలో చేరారు. జిల్లాలో అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితాను పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలకు అందుబాటులోకి ఉండేలా ఆయా మండలాల తహసీల్దార్లు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వారు అసంతృప్తిగా ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పిస్తూ ప్రకటన చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఎన్నికల కమిషన్ సూచించిన ఫిబ్రవరి 4 వరకు 18 సంవత్సరాలు నిండకుండా కొన్ని రోజులు తక్కువ ఉన్న వారికి కూడా ఈ అవకాశం కలిసి వచ్చినట్లయింది. 5 వరకు దివ్యాంగులకు అవకాశం.. ఓటర్ల నమోదు పొడిగింపుతో గత నెల 27 నుంచి మార్చి 5 వరకు దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఆయా మండల కేంద్రాల్లో దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల వద్ద వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓటరు నమోదు సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఎంతమంది దివ్యాంగులు ఓటర్లుగా ఉన్నారనే విషయం స్పష్టం కానుండడంతో పోలింగ్ సమయంలో వీరికి వీల్చైర్లు, తదితర సౌకర్యాలను కల్పించేందుకు సులువుగా ఉంటుందని ఎన్నికల సంఘం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులు నమోదు చేసుకోవాలి ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు చేసేం దుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నందున అర్హులైన యువతీ, యువకులు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. పోలింగ్ బూత్‌ల వద్ద రెండు రోజులపాటు బూత్ లెవల్ అధికారు లు (బీఎల్ఓలు) అందుబాటులో ఉంటారు. ఓటు నమోదు దరఖాస్తులు కేంద్రాల వద్ద అ ందుబాటులో ఉంటాయి. అర్హులైన వారు ఆధార్ కార్డు, ఫొటోతో ఫాం–6ను పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలి. ఓటర్ల జాబి తాలో నమోదు చేసుకునే వారికి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. – శ్రీను, రెవెన్యూ డివిజనల్ అధికారి, సంగారెడ్డి -
పోటెత్తిన యువత
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): ఎన్నికల వేళ జిల్లాలో ఓటు నమోదుకు భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో 1,59,961 మంది దరఖాస్తు చేసుకుంటే, బూత్‌స్థాయి అధికారుల వద్ద 54,736 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఆ రోజు నుండి రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, బదిలీకి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. వీటికి ఏకంగా 2,14,697 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక శిబిరాలతో ఫలితాలు అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి కళాశాలలో నమోదు చేసేందుకు అధికారులు కదిలారు. అదే విధంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద శనివారం, ఆదివారం బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించారు. దీంతో ఓటర్లుగా నమోదు అయ్యేందుకు యువత ఉత్సాహం చూపించారు. ఇప్పటికీ అవకాశం : ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగిసింది. అయితే ప్రస్తుతం కూడాఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో, స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో డబ్లు్యడబ్లు్యడబ్లు్య.ఎన్విఎస్పి.ఎన్ఐసి.ఇన్ వెబ్ పోర్టల్‌లో 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దారు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ (అక్టోబరు 31 వరకూ) నమోదు చేసుకున్న వారికి మాత్రం 2019, జనవరిలో ఓటు హక్కు కల్పిస్తారు. నవంబరు ఒకటో తేదీ నుండి వచ్చే దరఖాస్తులకు జనవరి 4వ తేదీలోగా ఓటు రాదు. వాస్తవంగా సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదలైన తరువాత నామినేషన్ ఆఖరు తేదీ వరకూ ఓటు నమోదు చేసుకోవచ్చు. వీరికి కూడా ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంది. జనవరి 4న తుది జాబితా ప్రచురణ: వచ్చిన దరఖాస్తులపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టి జనవరి 4వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఏటా అక్టోబరు నుంచి జనవరి వరకూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో ఏటా లక్ష లోపు దరఖాస్తులు వచ్చేవి. ఎన్నికలు దగ్గరపడటంతో ఈసారి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబరు కొత్తగా -
ముగిసిన ఓటరు నమోదు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమైన ఓటరు నమోదు డిసెంబర్ 23తో ముగిసింది. ఈ ప్రక్రియ సుమారు 36 రోజులుపాటు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 2,16,276 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు 2,12,296 మంది యువత నుంచి దరఖాస్తులు అందాయి. సోమవారం తుదిరోజు కావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు చేసే ప్రక్రియ కూడా కొనసాగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లో పొందుపర్చే ప్రక్రియ ప్రారంభించారు. కాగా, జిల్లా అధికారులు ఇప్పటివరకు 41,654 దరఖాస్తులు కంప్యూటర్లో డాటా ఎంట్రీ చేశారు. ఇంకా 1,32,073 దరఖాస్తులను డాటా ఎంట్రీ చేయాల్సి ఉంది.