సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో దివ్యాంగులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్ పీడీ మోతి, సంగారెడ్డి ఎమ్మార్వో పరమేశం
సాక్షి, సంగారెడ్డి: అర్హులై ఉండి ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం ఈ నెల 2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు స్వీకరిస్తారు. గత నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ 2019లో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓటరు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరాలను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫాం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తి చేసి బీఎల్‌ఓలకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 6,7,8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచుతారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
జిల్లాలో 11,99,713 మంది ఓటర్లు..
గత నెల 22న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా మేరకు జిల్లాలో మొత్తం 11,99,713 మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తగా ఓటర్ల నమోదుతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత 55,953 మంది అదనంగా ఓటర్ల జాబితాలో చేరారు. జిల్లాలో అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితాను పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలకు అందుబాటులోకి ఉండేలా ఆయా మండలాల తహసీల్దార్లు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని వారు అసంతృప్తిగా ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పిస్తూ ప్రకటన చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఎన్నికల కమిషన్ సూచించిన ఫిబ్రవరి 4 వరకు 18 సంవత్సరాలు నిండకుండా కొన్ని రోజులు తక్కువ ఉన్న వారికి కూడా ఈ అవకాశం కలిసి వచ్చినట్లయింది.
5 వరకు దివ్యాంగులకు అవకాశం..
ఓటర్ల నమోదు పొడిగింపుతో గత నెల 27 నుంచి మార్చి 5 వరకు దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఆయా మండల కేంద్రాల్లో దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల వద్ద వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓటరు నమోదు సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఎంతమంది దివ్యాంగులు ఓటర్లుగా ఉన్నారనే విషయం స్పష్టం కానుండడంతో పోలింగ్ సమయంలో వీరికి వీల్‌చైర్లు, తదితర సౌకర్యాలను కల్పించేందుకు సులువుగా ఉంటుందని ఎన్నికల సంఘం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
అర్హులు నమోదు చేసుకోవాలి
ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు చేసేం దుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నందున అర్హులైన యువతీ, యువకులు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. పోలింగ్ బూత్‌ల వద్ద రెండు రోజులపాటు బూత్ లెవల్ అధికారు లు (బీఎల్‌ఓలు) అందుబాటులో ఉంటారు. ఓటు నమోదు దరఖాస్తులు కేంద్రాల వద్ద అ ందుబాటులో ఉంటాయి. అర్హులైన వారు ఆధార్ కార్డు, ఫొటోతో ఫాం–6ను పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలి. ఓటర్ల జాబి తాలో నమోదు చేసుకునే వారికి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. – శ్రీను, రెవెన్యూ డివిజనల్ అధికారి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment