సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఎంఐఎంతో మరోసారి జట్టుకట్టిన గులాబీ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ప్రచార పర్వంలో దూసుకుపోయేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. రేపు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో, ఎల్లుండి మహేశ్వరం, ఎల్బీనగర్‌లో ప్రచారం చేయనున్నారు. (చదవండి: గ్రేటర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!)
అదే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్స్‌గా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మొహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌లు)
Comments
Please login to add a commentAdd a comment