సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. వివిధ పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు దుమ్ము లేపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను వివిధ పార్టీలు సమర్పించాయి.
కేసీఆర్, కేటీఆర్‌ల నేతృత్వంలో గులాబీ దళం...
అధికార టీఆర్‌ఎస్ నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మహ్మద్ మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్‌ఈసీకి టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసరెడ్డి జాబితా సమర్పించారు.
కాంగ్రెస్ నుంచి ఎవరంటే...
కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి (ఎంపీ), పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, జెట్టి కుసుమకుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజన్‌కుమార్ యాదవ్ ప్రచారం చేస్తారు. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి ఎస్‌ఈసీకి ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ లేఖ సమర్పించారు.
కమలదళం విషయానికొస్తే..
బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం. రఘునందన్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు బీజేపీ జాబితా సమర్పించింది.
జీహెచ్‌ఎంసీలో ప్రచారాన్ని పరుగెత్తించేది వీరే!
Published Sat, Nov 21 2020 8:31 AM | Last Updated on Sat, Nov 21 2020 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment