సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇక ఈ నెల 17న ఫలితాలు వెలువడనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ బరిలో 93 మంది అభ్యర్థులు కాగా ఓటర్లు 5,31,268 మంది ఉన్నారు. ఇక మూడు జిల్లాలకు కలిపి మొత్తం పోలింగ్ కేంద్రాలు 799 ఏర్పాటు చేశారు. ఇక నల్లగొండ-వరంగల్-ఖమ్మం బరిలో 71 మంది అభ్యర్థులు కాగా, ఓటర్ల సంఖ్య 5,05,565 గా ఉంది. 731 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment