న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 నేపథ్యంలో ప్రచారం, సభలపై విధించిన నిషేధాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) జనవరి 31 దాకా పొడిగించింది. అయితే తొలి రెండు దశల్లో ఎన్నికలు జరిగే 114 నియోజకవర్గాల్లో (ఫిబ్రవరి 10న తొలిదశలో 55, 20న మలిదశలో 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి) గరిష్టంగా 500 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించవచ్చని తెలిపింది.
అలాగే ఈ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఇంటింటికీ ఇకపై 10 మంది వెళ్లి ప్రచారం నిర్వహించుకోవచ్చు. ముందుగానే ఖరారు చేసిన బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ వీడియో వ్యాన్ల ద్వారా ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment