
పెద్దల ఆశ్వీర్వాదం తీసుకుంటున్న సర్పంచ్, సమితి సభ్యుని అభ్యర్థులు
భువనేశ్వర్/జాజ్‌పూర్: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు తారసపడుతుంటాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన మహిళా అభ్యర్థులు వినయ విధేయతలు మరింత ఎక్కువగా ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
జాజ్‌పూర్ జిల్లా, జాజ్‌పూర్ సమితి, ఎరబంగా పంచాయతీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సమితి సర్పంచ్ అభ్యర్థి రేఖా మల్లిక్, సమితి సభ్యురాలిగా పోటీ చేస్తున్న సస్మతి శెట్టి పంచాయతీ బహుముఖాభివృద్ధికి హామీ ఇస్తూ తమకు ఓటు వేసి, గెలిపించాలని ఇలా పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఓటుకో పాదాభివందనం లెక్కన పంచాయతీ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఇలా తలమునకలయ్యారు.