Votes!
-
ఎన్నికల చిత్రాలు.. ఓటు కోసం పడరాని పాట్లు.. మహిళ కాళ్లుకు..
భువనేశ్వర్/జాజ్‌పూర్: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు తారసపడుతుంటాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన మహిళా అభ్యర్థులు వినయ విధేయతలు మరింత ఎక్కువగా ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. జాజ్‌పూర్ జిల్లా, జాజ్‌పూర్ సమితి, ఎరబంగా పంచాయతీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సమితి సర్పంచ్ అభ్యర్థి రేఖా మల్లిక్, సమితి సభ్యురాలిగా పోటీ చేస్తున్న సస్మతి శెట్టి పంచాయతీ బహుముఖాభివృద్ధికి హామీ ఇస్తూ తమకు ఓటు వేసి, గెలిపించాలని ఇలా పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఓటుకో పాదాభివందనం లెక్కన పంచాయతీ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఇలా తలమునకలయ్యారు. -
దేశంలో పవర్ఫుల్ కపుల్ ఎవరో తెలుసా?
దేశంలో పవర్ఫుల్ కపుల్ ఎవరనే దానిపై ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సర్వే చేసింది. ఈ సర్వేలో టాప్ త్రీ ప్లేసెస్‌లో ఏ జంట నిలిచింది..? వాళ్లకి ఎంత ఓటింగ్ వచ్చింది..? ఈ సర్వేలో ఎంత మంది పాల్గొన్నారు..? ఓ సారి ఆ వివరాలను చూస్తే.. సర్వేలో పవర్ పుల్ కపుల్ ఎవరంటే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సంస్థ నిర్వహించిన పవర్ఫుల్ కపుల్ సర్వేలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. వీరికి 94 శాతం ఆమోదం లభించింది. ఇక బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె రెండో స్థానం లభించింది. వీరికి 86 శాతం మంది పవర్ఫుల్ కపుల్‌గా ఓటేశారు. ఇక మూడో ప్లేస్‌లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కాశర్మ జంట నిలిచింది. వీరికి 79 శాతం మంది ఆమోద ముద్ర వేశారు. అయితే.. 2019లో మొదటి స్థానంలో ఉన్న విరుష్క జంట.. ఈ మధ్య మీడియాకు పెద్దగా ఎక్స్పోజ్ కాకపోవడం, కోహ్లీ కెప్టెన్సీని కోల్పోవడంతో మూడో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఉన్న బలమైన కుటుంబాలే కాకుండా.. కొత్త వధూవరులు, కాబోయే జంటలను కూడా ఈ సారి సర్వేలో ఉంచారు. దీంతో త్వరలోనే ఒక్కటి కానున్న రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటకు 72 శాతం జనామోదం లభించి నాలుగో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 25 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న 1,362 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని ఐఐహెచ్‌బీ వెల్లడించింది. ఈ సంస్థ 2019లో చివరిసారిగా పవర్ఫుల్ కపుల్ ర్యాంకులను విడుదల చేసింది. 2020లో కరోనా కారణంగా సర్వే జరగలేదు. తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు 48 శాతం మార్కులు పడ్డాయి. ఈ జంట తొమ్మిదో స్థానంలో నిలిచింది. వీరికన్నా ముందు అక్షయ్, ట్వింకిల్. షారుఖ్, గౌరీఖాన్. సైఫ్, కరీనాకపూర్, అమితాబ్, జయాబచ్చన్ ఉన్నారు. చదవండి: కుక్క చేసిన పని.. జైలు పాలైన యువకుడు -
ఐదేళ్లా.. ఐదు నెలలా..?
సాక్షి, శ్రీకాకుళం: లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. సావిత్రి కోసం ఎన్టీఓడు పాడుతుంటే.. ఉలిక్కి పడి లేచాడు సర్వేశ్వరరావు.. సమయం ఉదయం ఐదున్నర. ప్రచారానికి ఇంకా సమయం ఉంది. ఆ లోపు తానే సొంతంగా కొంతమందినైనా కలుద్దామని అప్పటికప్పుడే అనుకుని కాస్తంత ఫ్రెష్ అయ్యి వీధిలో పడ్డాడు. మహిళామణుల ఊసులు వినలేకేమో కుళాయి బలహీనంగా ఏడుస్తోంది.. బిందె నిండడానికి అధమపక్షం అరగంటైనా పట్టేట్టు ఉంది. సరిగ్గా సర్వేశ్వరరావు అక్కడికే వెళ్లారు. ఏంటమ్మా.. నీరు అవీ బాగా వస్తున్నాయా.. ఇబ్బందులేమీ లేవు కదా.. మైక్ లేదు కాబట్టి చాలా క్యాజువల్‌గా మాట్లాడాడు. మందీమార్బలం లేని ఎమ్మెల్యేను చూసి గుర్తు పట్టలేకపోయిన మహిళలు. కొద్దిసేపటికే తెలివి తెచ్చుకున్నారు. అంతే.. అందరూ చుట్టూ చేరిపోయారు. బాబూ.. ఐదేళ్ల ముందు ఇక్కడే జీపుపై నుంచుని ట్యాంకు గురించి హామీలిచ్చారు. గుర్తుందా.. మహిళల మొదటి ప్రశ్న. ఇచ్చామా.. ఇచ్చే ఉంటాం. శతకోటిలో ఇదొకటి అని సర్వేశు మనసులో అనుకుని, అవునమ్మా ట్యాంకుతో మీ కష్టాలన్నీ తీరాయి కదా అన్నాడు గర్వంగా. ‘మా మేడెక్కి ఈ చుట్టుపక్కల ఒక్క ట్యాంకు ఉన్నట్టు చూపిస్తే.. మా ఓట్లన్నీ మీకే’ అని వత్సల గబుక్కున అనేసింది. సర్వేశుకు పరిస్థితి అర్థమైపోయింది. గత సారి ఏదో అలా అయిపోయిందమ్మా.. ఈసారి అలా కాదు. చూడండి, ఓట్లు మాత్రం నాకే వెయ్యాలి అని గుంపులో నుంచి బయటపడ్డానికి ప్రయత్నించాడు. ‘జీపుపై ఉన్నప్పుడు వంద మాటలు చెబుతా రు.. ఇలా నేల మీద నించున్నప్పుడు మాత్రం ఒక్కరితో మాట్లాడలేరు. మీకెందుకు ఓటు’ అని భాగ్యవతి మొహమ్మీదే అనేయడంతో ఏమీ అనలేక సర్వేశు మెల్లగా జారుకున్నాడు. వెనుక మంది లేకుండా ఇలా గుంపులోకి అదీ ఆడవాళ్ల దగ్గరికి వెళ్లకూడదని సర్వేశుకు జ్ఞానోదయమైంది. అలా నడుస్తూ నడుస్తూ ఓ గుడిసె దగ్గర ఆగాడు. ఇంటి బయట కల్లాపి చల్లుతున్న పద్మ సర్వేశును చూసి కాసింత ఆశ్చర్యపోయింది. ఆమె హావభావాలు గమనించిన సర్వేశు ఈమేదో అమాయకురాలిలా ఉందనుకుని అటువైపే అడుగులు వేశారు. ఏమ్మా.. ఇల్లు లేదా ఇంకా గుడిసెలోనే ఉన్నారు.. నిమ్మళంగా అడిగాడు. ఇల్లు మంజూరైందయ్యా.. మీ వెనుక తిరిగే వారున్నారు కదా.. ఏదో కమిటీ అట.. ఐదు వేలు ఇస్తేనే నీకు ఇల్లు ఇస్తామని సెప్పారు. అంత డబ్బు కట్టనేక ఇలా గుడిసె నీడన బతకతన్నాం బాబూ అంది పద్మ. అమ్మా.. ఐదు తీసుకుంటున్నారా.. నాకు రెండున్నరే ఇస్తున్నారు అని లోలోపలే అనుకున్న సర్వేశు ఈమెతో మాట్లాడితే బండారం బయటపడుతుందని భయపడి ‘నాకు ఓటెయ్యమ్మా.. ఈసారి ఇల్లు గ్యారెంటీ’ అని వేగంగా నడిచాడు. మైదానం నుంచి ఓ కుర్రమూక అటుగా వచ్చి సర్వేశు మాటలు విని ఆయన చుట్టూ చేరిపోయారు. చచ్చానురా.. బాబోయ్.. అనుకున్నాడు సర్వేశు. ఎమ్మెల్యే గారూ.. ఇన్నాళ్లకు దొరికారు అన్న భరత్.. ఐదేళ్ల కిందట ఎమ్మెల్యే చెప్పిన మాటలన్నీ ఒక్కసారి ఏకరువు పెట్టాడు. ఇవన్నీ ఏమయ్యాయండీ అని అంతా మూకుమ్మడిగా అడిగేసరికి సర్వేశు గుటకలు మింగి ఏదో చెబుదామని ప్రయత్నించాడు. ఐదు నెలలుగా డబ్బులు ఇస్తున్నాం కదయ్యా.. చాలడం లేదా ఇంకా అని భయపడుతూనే అన్నాడు సర్వేశు. డబ్బులిస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదనే విషయం మర్చిపోతామా.. నాలుగు నెలలు కాసిన్ని డబ్బులు విదిలిస్తే నాలుగేళ్లు మీ అరాచకాలు మర్చిపోతామా..? అసలు మీరెప్పుడైనా కారు దిగి ఇటుగా నడిచారా.. కాలువ ఉందో లేదో చూశారా.. ఇక్కడి మనుషులు ఎలా బతుకుతున్నారో గమనించారా.. అంటూ అభ్యుదయవాదైన నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు. సర్వేశుకు అంతా అర్థమైపోయింది. ఐదు నెలల కాలక్షేపం ఐదేళ్ల పాలన ఒక్కటి కాదని అర్థమైంది. జనం తాను అనుకున్నంత అమాయకులు కాదని తెలిసింది. ప్రశ్నించడం కూడా చేతనవుతుందని జ్ఞానోదయమైంది.. అన్నింటి కంటే ఒక్కటి మాత్రం బాగా తెలిసింది. చుట్టూ మంది లేకుండా ఒంటరిగా జనం దగ్గరకు వెళ్లకూడదని స్పష్టంగా తెలిసింది. అంతే.. ఓటు అడగడం కూడా మర్చిపోయి ఇంటి వైపు పరుగు లాంటి నడక అందుకున్నాడు. -
కొత్తగూడెం: పోలింగ్ ప్రశాంతం
సాక్షి, కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కలిపి 79.5 శాతం ఓట్లు పోలయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో 88.61 శాతం, భద్రాచలంలో 78.5 శాతం, కొత్తగూడెంలో 80.18 శాతం, పినపాకలో 82 శాతం, ఇల్లెందులో 68 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో గంట ముందుగానే పోలింగ్ ముగించేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ సాయంత్రం ఓటర్లు ఎక్కువగా రావడంతో 4 గంటలలోగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిల్చున్నవారికి అవకాశం కల్పించారు. పలు కేంద్రాల్లో మొదట్లో ఈవీఎంలు మొరాయించడం, కొన్ని చోట్ల మధ్యమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ని కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొదట్లో మందకొడిగా ప్రారంభమైనప్పటికీ చివర్లో ఓటర్లు పోటెత్తడం గమనార్హం. పలు కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యం అయిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న చర్ల మండలంలోని కొన్ని బూత్‌ల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి రావడంతో మరింతగా జాగ్రత్తలు పాటించారు. ఎన్నికల నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నా యి. అయితే భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. ఈ క్రమంలో వాజేడు మండలంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రితో వాజేడు నుంచి భద్రాచలం మీదుగా పాల్వంచలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. అయితే సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు వెంకటాపురం చేరుకున్న తరువాత చర్ల, భద్రాచలం మార్గంలో వెళ్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు సూచించడంతో వెంకటాపురం నుంచి తిరిగి వాజేడు వెళ్లారు. అక్కడి నుంచి ఏటూరునాగారం, మంగపేట, మణుగూరు మీదుగా పాల్వంచకు చేరుకున్నారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన రహదారి కాకుండా అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రోత్సవాలు శనివారం వరకు ఉండడంతో పోలింగ్ భద్రతతో పాటు సమాంతరంగా సరిహద్దులో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చర్ల మండలం పెదమిడిసిలేరు వద్ద సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది మావోయిస్టు యాక్షన్ టీం సభ్యు డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి డైరెక్షనర్ మైన్స్(పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంచనాల్లో పార్టీలు, అభ్యర్థులు.. నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయినప్పటి నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం హోరాహోరీ ప్రచారం చేశారు. అనేక రకాల వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో ఎన్నికల రణక్షేత్రంలో ముందుకెళ్లారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు కేడర్‌ను సమాయత్తం చేసుకుంటూ పోలింగ్ ముగిసేవరకు రేయింబవళ్లు పనిచేశారు. ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో ఆయా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. మరో మూడు రోజుల్లో తమ భవితవ్యం తేలనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే పలు రకాల అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి మధ్యే పోటీ ఉంది. అన్ని చోట్లా పోటీ నువ్వా.. నేనా.. అనే స్థాయిలో పోలింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
విద్యార్థులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
సాక్షి, కరీంనగర్ : ఓటు హక్కు కలిగిన విద్యార్థులందరూ వినియోగించుకోవాలని శ్రీచైతన్య జూనియర్ కళాశాల చైర్పర్సన్ శ్రీలత పిలుపునిచ్చారు. శుక్రవారం భగత్‌నగర్ నుంచి బస్టాండ్ వరకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ నమూనా తీరును, ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పవన్‌కుమార్, ఎండీ.సత్తార్, ప్రిన్సిపాల్ శ్రీకన్య, సరస్వతి, నిరూష, తేజస్విని, భవాని తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతలు ఓట్లు ఎలా అడుగుతారు..?
వీపనగండ్ల (వనపర్తి): తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద బలంగా మాట్లాడటానికే జంకిన కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని తూంకుంటలో టీఆర్ఎస్లో చేరిన పలువురిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ ఉద్యమ తీవ్రతను పసిగట్టిన సోనియాగాంధీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, తాగునీటి లాంటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలయమ్యారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం లేకపోతే ఎలాంటి అభివృద్ధి జరగదని వరుసగా మూడు సార్లు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనేక గ్రామాల్లో నేటికీ నీటి సమస్య ఉందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రెండు లక్షల కి.మీ. మేర పైపులైన్ వేసి జూన్ 30నాటికి ఇంటింటికీ తాగునీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ లోకారెడ్డి, విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, కృష్ణప్రసాద్, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న హిజ్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు ఓటు హక్కుకు కూడా నోచుకొని హిజ్రాలు ఈసారి దాదాపు 500 మంది ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు చేయనున్నారు. హిజ్రాల పట్ల సమాజం చూపుతున్న వివక్ష రాజకీయపరంగా ముగియనుంది. వీరిని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఓటర్ల జాబితాలో లింగం గురించి తెలిపే కాలంలో స్త్రీ, పురుషులు అని రెండు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా అదర్స్ అనే మూడో వర్గీకరణ కింద హిజ్రాలను ఓటర్లుగా నమోదు చేయనున్నారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. 2012 మున్సిపల్ ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్లో అదర్స్ అనే కాలం చేర్చినప్పటికీ హిజ్రాలను ప్రత్యేక వర్గీకృత శ్రేణి కింద ఓటర్లుగా నమోదు చేయలేదు. వచ్చే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పలుచోట్ల శిబిరాలు నిర్వహించి వీరి పేర్లను నమోదు చేస్తోంది. ఆగస్టు 21నాటి వరకు ఓటర్ల జాబితాలో 519 మంది హిజ్రాల పేర్లు నమోదయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. తుది జాబితా ఖరారు చేసేనాటికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఢిల్లీ ఎన్నికల కార్యాలయం ఆశిస్తోంది. వికాస్పురి, బవానా, మతియాలాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. న్యూఢిల్లీ, మాలవీయనగర్, షాకూర్బస్తీ, కస్తూర్బానగర్లలో ఒక్కరు కూడా లేరని ఎన్నికల సంఘం కార్యాలయం సమాచారం తెలుపుతోంది. సుల్తాన్పుర్మజ్రా, బవానాలలో 22 మంది, మతియాలాలో 23 మంది, వికాస్పురిలో 20మంది, కిరారీ, నాంగ్లోయ్జాట్లలో 16 మంది ,లక్ష్మీ నగర్లో 15 మంది, పాలం, కోండ్లీలలో 15 మంది, విశ్వాసనగర్, కల్కాజీ, ఆదర్శనగర్‌లలో 12 మంది, నరేలాలో 1 చొప్పున ఉన్నారని నమోదయింది. ఢిల్లీలో మొత్తం 1,14,99,758 ఓటర్లుండగా అందులో 63,71,809 మంది పురుషులు, 51,27,430 మంది మహిళ ఓటర్లని తేలింది. -
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న హిజ్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు ఓటు హక్కుకు కూడా నోచుకొని హిజ్రాలు ఈసారి దాదాపు 500 మంది ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు చేయనున్నారు. హిజ్రాల పట్ల సమాజం చూపుతున్న వివక్ష రాజకీయపరంగా ముగియనుంది. వీరిని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఓటర్ల జాబితాలో లింగం గురించి తెలిపే కాలంలో స్త్రీ, పురుషులు అని రెండు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా అదర్స్ అనే మూడో వర్గీకరణ కింద హిజ్రాలను ఓటర్లుగా నమోదు చేయనున్నారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. 2012 మున్సిపల్ ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్లో అదర్స్ అనే కాలం చేర్చినప్పటికీ హిజ్రాలను ప్రత్యేక వర్గీకృత శ్రేణి కింద ఓటర్లుగా నమోదు చేయలేదు. వచ్చే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పలుచోట్ల శిబిరాలు నిర్వహించి వీరి పేర్లను నమోదు చేస్తోంది. ఆగస్టు 21నాటి వరకు ఓటర్ల జాబితాలో 519 మంది హిజ్రాల పేర్లు నమోదయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. తుది జాబితా ఖరారు చేసేనాటికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఢిల్లీ ఎన్నికల కార్యాలయం ఆశిస్తోంది. వికాస్పురి, బవానా, మతియాలాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. న్యూఢిల్లీ, మాలవీయనగర్, షాకూర్బస్తీ, కస్తూర్బానగర్లలో ఒక్కరు కూడా లేరని ఎన్నికల సంఘం కార్యాలయం సమాచారం తెలుపుతోంది. సుల్తాన్పుర్మజ్రా, బవానాలలో 22 మంది, మతియాలాలో 23 మంది, వికాస్పురిలో 20మంది, కిరారీ, నాంగ్లోయ్జాట్లలో 16 మంది ,లక్ష్మీ నగర్లో 15 మంది, పాలం, కోండ్లీలలో 15 మంది, విశ్వాసనగర్, కల్కాజీ, ఆదర్శనగర్‌లలో 12 మంది, నరేలాలో 1 చొప్పున ఉన్నారని నమోదయింది. ఢిల్లీలో మొత్తం 1,14,99,758 ఓటర్లుండగా అందులో 63,71,809 మంది పురుషులు, 51,27,430 మంది మహిళ ఓటర్లని తేలింది. -
ఢిల్లీ ఓటరు రూటే వేరు..
న్యూఢిల్లీ: దేశంలో అన్ని రాజకీయపార్టీలు తమ ఓటుబ్యాంక్‌ను నమ్ముకునే రాజకీయాలు చేస్తుం టాయి. వాటికి కులాలు, మతాలు, సామాజిక వర్గాలు అండగా ఉంటుంటాయి. ఏ రాష్ట్రం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.. కానీ ఢిల్లీలో మాత్రం కులాల కన్నా శ్రేణుల ప్రభావమే పార్టీలపై ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఢిల్లీలో ప్రజలు సంపన్న శ్రేణి, మధ్య తరగతి శ్రేణి, పేదవర్గాలు ఇలా మూడు రకాలుగా విడిపోయి వివిధ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీ రాజకీయాలలో నెగ్గాలంటే కులాల కంటే ఎక్కువగా వివిధ వర్గాలపైనే దృష్టి సారించాల్సిన అవసరముందని, ఇవి గెలుపునే ప్రభావితం చేయగలిగే రీతిలో ఉన్నాయని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) పరిశోధకుడు సంజయ్ కుమార్ తెలిపారు. ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఎలక్టోరల్ పొలిటిక్స్ ఇన్ ఢిల్లీ: ఫ్రమ్ క్లాస్ టూ క్యాస్ట్’ పుస్తకాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ‘ఈ పుస్తకంలో మారిన ఢిల్లీ ఓటర్ల మనోభావాలు వెల్లడించేందుకు ప్రయత్నించా. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు, తర్వాత ఓటర్ల అభిప్రాయాలను సేకరించా. అప్పటి స్థితులను వివరిస్తూనే ప్రస్తుతం నగరంలో ఉన్న ఓటర్ల వ్యవహార శైలి ఎలా ఉందో వివరించే ప్రయత్నం చేశాన’ని సంజయ్ అన్నారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి అనేక మంది వలస వచ్చి స్థిరపడ్డారు. వీరిలో దిగువ, పేద తరగతి వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. పేదల సంఖ్య విపరీతంగా పెరిగింద’ని కుమార్ అన్నారు. 1993లో ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ రాజకీయాలను దగ్గర నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ‘ఢిల్లీని ఒక నగరంగా చూడటం కష్టం. ఎందుకంటే మూడు నగరాలు భౌగోళికంగా ఇందులో కలిసిపోయాయి. కాని సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మాత్రం ఇంకా విడిగానే ఉన్నాయన్నారు. ఢిల్లీలో బీజేపీకి సరైన నాయకుడు లేకపోవడంవల్లే ఇక్కడ అధికారాన్ని చేపట్టలేకపోయిందని ఆయన పుస్తకంలో వివరించారు. మదన్‌లాల్ ఖురానా పోయిన తర్వాత అలాంటి నాయకుడు కనిపించలేదన్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఉన్న ఉన్నత శ్రేణికి చెందిన కొన్ని ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయన్నారు. కార్యక్రమానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ భారత్‌లోని పోలింగ్ సరళిపై ఇప్పటివరకు విస్తృతస్థాయిలో చర్చలు జరగలేదన్నారు. ఒకే కులానికి చెందిన ప్రజలు ఉన్నత, మధ్య, దిగువస్థాయి శ్రేణులుగా విడిపోయారని, వీరు వివిధ పార్టీలకు మద్దతిస్తున్నారనే విషయం ఈ పుస్తకం ద్వారా కుమార్ చక్కగా వివరించారన్నారు. పట్టణ రాజకీయాలు ఎంతో ప్రధానమైనవని, రానురాను ఇక్కడి ఓటర్లలో కూడా పెనుమార్పు వస్తోందని పుణే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎన్నికల విధానం, పోటీ, స్థానిక రాజకీయాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంజయ్‌కుమార్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం గమనార్హం. -
అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది అఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. దీనికోసం ప్రైవేట్ సంస్థల సహాయాన్ని తీసుకుంటోంది. ఇవి నగరంలోని ప్రతి ఇంటికీ సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఒక్కో ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు. వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనే అంశాల వారీగా సర్వే చేస్తున్నాయి. అలాగే ఏయే స్థానాల్లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి, ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశాలపై కూడా అంతర్గతంగా సమాచారాన్ని అధ్యయనం చేయిస్తోంది. వీటి ఆధారంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించి ప్రజల ముందుకు వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. పోలింగ్ బూత్‌ల వారీగా అధ్యయనం చేసిన నివేదికల ఆధారంగా ఓటర్లను ఆకట్టుకోవాలని యోచిస్తోంది. 26 స్థానాల్లో బీజేపీ సులువుగా విజయం సాధించగలదని పార్టీ అంతర్గత సర్వే చెబుతోంది. పది సీట్లలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుందని సదరు అధ్యయనంలో తేలింది. నగరంలోని నియోజకవర్గాలను బీజేపీ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తోంది. బీజేపీ పక్కాగా విజయం సాధించగల సీట్లను ఏ కేటగిరీలో చేర్చారు. విజయం కోసం దృష్టి సారించవలసిన నియోజకవర్గాలను బి కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీ కింద 14 సీట్లున్నాయి. మరింతగా పార్టీ దృష్టి పెట్టవలసిన సీట్లను సి కే టగిరీలో చేర్చారు. దీని కింద 20 నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ తప్పక గెలిచే అవకాశాలున్న 10 సీట్లను డీ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో సీట్లను వీలైనంత తగ్గించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందా లేదా అన్నది, బీ,సీ కేటగిరీల్లోని 34 సీట్లపై ఆధారపడి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ యోచిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశం ఉన్న ముగ్గురు ఆశావహులను షార్ట్ లిస్టు చేయడం కోసం పార్టీ మూడు సర్వే ఏజెన్సీలను నియమించినట్లు తెలిసింది. ఈ సంస్థలు ఆగస్టు 25 నాటికి నివేదికలు సమర్పిస్తాయని అంటున్నారు. సీఎం రేసులో హర్షవర్ధన్ పాటిల్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పాటిల్ ముందున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న విజయ్ గోయల్ కన్నా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్ధన్నే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోయల్ పనితీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నట్టు ఇప్పటికే పార్టీకి ఫిర్యాదులు అందాయి. సీఎం అభ్యర్థిని నిర్ణయించలేదు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి , ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై కేంద్ర పార్లమెంటరీ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై బోర్డు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నవంబర్లోనే ‘ముఖ్య’నేత ఖరారు
న్యూఢిల్లీ: పదిహేనేళ్లు అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. ఈ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు అంటే నవంబర్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కారీ బుధవారం విలేకరులకు తెలిపారు. సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ముఖ్య పదవికి ఢిల్లీ బీజేపీశాఖ మాజీ అధ్యక్షుడు హర్షవర్ధన్ పాటిల్‌ను ప్రకటిస్తారన్న విలేకరుల ప్రశ్నకు గడ్కారీ సమాధానమిస్తూ ఇప్పటివరకు ఎవరి పేరును ఖరారు చేయలేదన్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు సన్నిహితంగా ఉండటంతో పాటు అవినీతి ఆరోపణలు లేని అందరికీ ఆమోదయోగ్యుడైన వర్ధన్ పేరు పరిశీలనకు వచ్చే అవకాశముం దని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చిన సీనియర్ నాయకులు ఆ పదవికి వర్ధన్ ఆమోదయోగ్యుడని తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీని గురించి తనకేమీ తెలియదని వర్ధన్ అన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ మాట్లాడు తూ సీఎం అభ్యర్థిత్వం విషయంలో తగిన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గందరగోళానికి తెరదించేందుకే... కార్యకర్తల్లో ఉన్న గందరగోళానికి తెరదించేందుకు సాధ్యమైనంత త్వరగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ యోచిస్తుందని వర్గాలు తెలిపాయి. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఖ్య పదవికి వీకే మల్హోత్రా పేరును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించి సంకేతాలున్నాయని, తొందర్లోనే ప్రకటన వస్తుందని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గోయల్ పనితీరుపట్ల పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తి గురించి అధిష్టాన ప్రముఖులకు అవగాహన ఉందన్నారు. ఇప్పటికే గోయల్ పనితీరుపై బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, వర్ధన్, మాజీ మేయర్ అర్తి మెహ్రా, అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గోయల్ మాట్లాడుతూ పార్టీ నాయకుల్లో ఎలాంటి నైరాశ్యం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేస్తున్నామని తెలిపారు. పార్టీలో అంతర్గత పోరు లేదని, పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామని వివరించారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ సన్నద్ధతకు వివిధ విషయాల గురించి ఇటీవలే నితీన్ గడ్కారీతో గోయల్ సమావేశమై చర్చించారు. సమష్టిగా పనిచేయండి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించేందుకు పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని గడ్కారీ కోరారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లతో బుధవారం సమావేశమైన ఆయన ఈ మేరకు నాయకులకు హితబోధ చేశారు. వార్డుస్థాయిలో పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా శ్రమించాలన్నారు. కౌన్సిలర్ ప్రదర్శనను బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్లను ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కౌన్సిలర్లకు ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తల మధ్య అసంతృప్తి ఉంటే వాటన్నింటిని పక్కనపెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.