దేశంలో పవర్‌ఫుల్ కపుల్ ఎవరనే దానిపై ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సర్వే చేసింది. ఈ సర్వేలో టాప్ త్రీ ప్లేసెస్‌లో ఏ జంట నిలిచింది..? వాళ్లకి ఎంత ఓటింగ్ వచ్చింది..? ఈ సర్వేలో ఎంత మంది పాల్గొన్నారు..? ఓ సారి ఆ వివరాలను చూస్తే..
సర్వేలో పవర్ పుల్ కపుల్ ఎవరంటే..
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సంస్థ నిర్వహించిన పవర్‌ఫుల్ కపుల్ సర్వేలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. వీరికి 94 శాతం ఆమోదం లభించింది. ఇక బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె రెండో స్థానం లభించింది. వీరికి 86 శాతం మంది పవర్‌ఫుల్ కపుల్‌గా ఓటేశారు. ఇక మూడో ప్లేస్‌లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కాశర్మ జంట నిలిచింది. వీరికి 79 శాతం మంది ఆమోద ముద్ర వేశారు. అయితే.. 2019లో మొదటి స్థానంలో ఉన్న విరుష్క జంట.. ఈ మధ్య మీడియాకు పెద్దగా ఎక్స్‌పోజ్ కాకపోవడం, కోహ్లీ కెప్టెన్సీని కోల్పోవడంతో మూడో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు దేశంలో ఉన్న బలమైన కుటుంబాలే కాకుండా.. కొత్త వధూవరులు, కాబోయే జంటలను కూడా ఈ సారి సర్వేలో ఉంచారు. దీంతో త్వరలోనే ఒక్కటి కానున్న రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటకు 72 శాతం జనామోదం లభించి నాలుగో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 25 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న 1,362 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని ఐఐహెచ్‌బీ వెల్లడించింది. ఈ సంస్థ 2019లో చివరిసారిగా పవర్‌ఫుల్ కపుల్ ర్యాంకులను విడుదల చేసింది. 2020లో కరోనా కారణంగా సర్వే జరగలేదు. తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు 48 శాతం మార్కులు పడ్డాయి. ఈ జంట తొమ్మిదో స్థానంలో నిలిచింది. వీరికన్నా ముందు అక్షయ్, ట్వింకిల్. షారుఖ్, గౌరీఖాన్. సైఫ్, కరీనాకపూర్, అమితాబ్, జయాబచ్చన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment