
నమూనా బ్యాలెట్ వద్ద సెల్ఫీ దిగుతున్న విద్యార్థులు
సాక్షి, కరీంనగర్ : ఓటు హక్కు కలిగిన విద్యార్థులందరూ వినియోగించుకోవాలని శ్రీచైతన్య జూనియర్ కళాశాల చైర్‌పర్సన్ శ్రీలత పిలుపునిచ్చారు. శుక్రవారం భగత్‌నగర్ నుంచి బస్టాండ్ వరకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ నమూనా తీరును, ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పవన్‌కుమార్, ఎండీ.సత్తార్, ప్రిన్సిపాల్ శ్రీకన్య, సరస్వతి, నిరూష, తేజస్విని, భవాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment