తూంకుంటలో మాట్లాడుతోన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల (వనపర్తి): తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద బలంగా మాట్లాడటానికే జంకిన కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని తూంకుంటలో టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ ఉద్యమ తీవ్రతను పసిగట్టిన సోనియాగాంధీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు.
60 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, తాగునీటి లాంటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలయమ్యారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం లేకపోతే ఎలాంటి అభివృద్ధి జరగదని వరుసగా మూడు సార్లు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనేక గ్రామాల్లో నేటికీ నీటి సమస్య ఉందన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా రెండు లక్షల కి.మీ. మేర పైపులైన్ వేసి జూన్ 30నాటికి ఇంటింటికీ తాగునీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ లోకారెడ్డి, విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, కృష్ణప్రసాద్, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment