జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని హైవే దిగ్బంధం | village of Hosur Protest On Highway For jallikattus Venue | Sakshi
Sakshi News home page

జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని హైవే దిగ్బంధం

Published Thu, Feb 2 2023 2:11 PM | Last Updated on Thu, Feb 2 2023 3:16 PM

village of Hosur Protest On Highway For jallikattus Venue - Sakshi

హోసూర్‌(తమిళనాడు):  కృష్టగిరి జిల్లా హోసూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టు పోటీలకు అనుమతి ఇవ్వకపోవడంతో చెన్నై-బెంగళూరు హైవేను  వందలాది మం గ్రామస్తులు దిగ్బంధించారు. దాంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మూడు పోలీసు వాహనాలు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. 

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. గ్రామంలో జల్లికట్టు నిర్వహణ అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసనకు దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement