జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని హైవే దిగ్బంధం
హోసూర్(తమిళనాడు): కృష్టగిరి జిల్లా హోసూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టు పోటీలకు అనుమతి ఇవ్వకపోవడంతో చెన్నై-బెంగళూరు హైవేను వందలాది మం గ్రామస్తులు దిగ్బంధించారు. దాంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మూడు పోలీసు వాహనాలు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. గ్రామంలో జల్లికట్టు నిర్వహణ అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసనకు దిగారు.