
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు( హోసూరు): పెళ్లి చేయాలని కోరినా తల్లిదండ్రులు పట్టించుకోలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాయకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. రాయకోట సమీపంలోని పిల్లారి అగ్రహారం గ్రామానికి చెందిన అమావాసికి అజిత్ కుమార్, అరుళ్ కుమార్ (18) ఇద్దరు కుమారులు ఉన్నారు. అజిత్‌కుమార్ హోసూరులోని ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల అరుళ్‌కుమార్ తనకు పెళ్లి చేయాలని తండ్రిని కోరాడు. అన్న పెళ్లి తరువాతే నీ పెళ్లి అని చెప్పడంతో మనోవేదనకు గురైన అరుళ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment