హోసూరు: హోసూరు సమీపంలోని శానసంద్రం వద్ద గల ఎం.ఎస్.గ్లోబల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ మైదానాన్ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణా అకాడమితో విద్యార్థులకు క్రికెట్‌పై శిక్షణ అందజేసేందుకు అధికారికంగా ధోని సమక్షంలో ఒప్పందం జరిగింది.
అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ మైదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమి అధికారి విశ్వనాథన్, పాఠశాల నిర్వా హకులు చంద్రశేఖర్, భువనేశ్వరి, వినిత్ చంద్రశేఖర్, దీపిత, విష్ణుగౌరవ్, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment