ఆంధ్రకు చెందిన వ్యక్తి అరెస్టు
హొసూరు: ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్‌లో ఉంచిన నగదును అపరహరించి వెళ్తున్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాహనదారుడు పట్టుకొని కావేరి పట్టణం పోలీసులకు అప్పగించాడు. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని దేవరముక్కుళంకు చెందిన అరుళ్‌మణి(41) కావేరిపట్టణంలో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం వ్యాపారం కోసం తన ద్విచక్ర వాహనంలో కావేరి పట్టణానికి వచ్చి ద్విచక్రవాహనాన్ని పక్కన నిలిపి తన జేబులో ఉన్న రూ. 4,500ను ట్యాంకు కవర్‌లో ఉంచి, వ్యాపారంలో నిమగ్నమయ్యాడు.
ఈ సమయంలో అక్కడికొచ్చిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో ఉన్న డబ్బును తీసుకొని పరారైయ్యాడు. విషయం గమనించిన అరుళ్‌మణి, స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని పట్టుకొని కావేరి పట్టణం పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా ఆంధ్రరాష్ట్రం అనంతపురం జిల్లా నల్లచెరువు గ్రామానికి చెందిన గణేష్(40) అని తెలిసింది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ద్విచక్రవాహనంలో డబ్బు అపహరణ
Published Sun, Oct 9 2016 11:55 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
Advertisement
Advertisement