
న్యూఢిల్లీ: దేశంలో యాపి ల్ ఐఫోన్ల తయారీకి సంబంధించి అతిపెద్ద ప్లాంట్ కర్ణాటకలోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా 60వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ వివరాలను కేంద్ర టెలికం, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఐఫోన్ల తయారీపై రాంచీ, హజారీబాగ్‌కు చెందిన ఆరువేల మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు.