మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి | Hosur: Child falling in boiling milk | Sakshi
Sakshi News home page

మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి

Published Mon, Sep 4 2017 8:48 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి

మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి

చెన్నై: బేకరీలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ మరుగుతున్న పాల పాత్రలో పడి మృతి చెందాడు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. హోసూర్‌లోని చినఎలసగిరికి చెందిన  మురుగేష్‌ (30) బేకరీ నిర్వహిస్తుంటాడు. అతని కుమారుడు భవుస్యాకు మూడేళ్లు.

ఆగస్టు 30వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో బేకరీలో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ బాలుడు అనుకోకుండా పక్కనే ఉన్న మరుగుతున్న పాల పాత్రలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన భవుస్యాని చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి భవుస్యా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement