అమెరికాలోని పెన్సిల్వేనియాలో అలెసియా ఓవెన్స్ అనే యువతి మానవత్వాన్ని మరిచి తన బాయ్‌ఫ్రెండ్‌కు చెందిన 18నెలల చిన్నారిని పొట్టనబెట్టుకుంది. గతేడాది జూన్‌లోని జరిగిన ఈ ఘటనలో అలెసియాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అటార్నీ జనరల్ మిచెల్ హెన్రీ తెలిపిన వివరాల ప్రకారం.. 18 నెలల ఐరిస్ రీటా అల్ఫెరా మృతికి కారణం అలెసియా అని.. పాపకు జరిపిన శవపరీక్షలో నమ్మలేని నిజాలు భయటపడ్డాయని తెలిపారు. అసిటోన్ అనే రసాయనం, వ్యాచ్ బ్యాటరీలు, స్క్రూలను పాపకు తినిపించడం వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు.
20 ఏళ్ల అలెసియా ఓవెన్స్.. జూన్25, 2023న పాప ఐరిస్ రీటా అల్ఫెరా తండ్రి బెయిలీ జాకబ్ పక్కనే ఉన్న ఒక స్టోర్ వెళ్లాడు. అదే సమయంలో పాపలో ఇంట్లో ఉన్న అలెసియా ఐరిస్ రీటాలో ఉలుకుపలుకు లేదని గమనించారు. అయితే ఈ సమాచారాన్ని ఆమె బెయిలీ జాకబ్‌కు అందించింది. దీంతో బెయిలీ జాకబ్ పాపను పిట్స్బర్గ్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం పాప ఐరిస్ రీటా మృతి చెందింది. పాప అవయవాల వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పాప ఐరిస్ తన తల్లి ఎమిలి అల్ఫెరాతో ఉంటోంది. అయితే తండ్రి బెయిలీ జాకబ్‌కు కేవలం సందర్శన హక్కులు మాత్రమే ఉండటం గమనార్హం.
పాప మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు అలెసియా ఫోన్ పరిశీలించగా.. పలు నమ్మలేని నిజాలు భయటపడ్డాయి. పాప ఐరిస్ మృతికి ముందు.. అలెసియా పిల్లలకు హానీ చేసే వస్తువులు, పద్దతులకు సంబంధించి ఫోన్‌లో సమాచారాన్ని వెతికినట్లు బయటపడింది. పిల్లలకు హాని కలిగించే అసిటోన్ రసాయనం, బ్యాటరీలు, నెయిల్ పాలీష్, చిన్న వాటర్ బాల్స్, చిన్నపిల్లలకు విషపూరితంగా మారే బ్యూటీ ప్రాడక్టులను కూడా వెతికినట్లు పోలీసులు గుర్తించారు. శవ పరీక్షల నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా తేలటంతో అలెసియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు చిన్నారిని చంపిందనే విషయంపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment